చలిమంట కారణంగా సజీవ దహనమైన మారయ్య ఇన్‌సెట్‌లో (మారయ్య ఫైల్)
రాయపర్తి: చలి మంటే ఓ వృద్ధుడి పాలిట చితిమంటైంది. చలి తీవ్రతను తట్టుకోలేక ఇంట్లోనే చలికాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుంట మారయ్య (85), మల్లమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక్క కూతురు. అందరి వివాహాలు చేశారు. భార్య మల్లమ్మ మృతితో మారయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. రెండు నెలల క్రితం అనారోగ్యం బారిన పడి కాళ్లు చచ్చుపడిపోయాయి. చలిని తట్టుకోలేక మంచం పక్కనే మంట పెట్టుకుని పడుకున్నాడు. మధ్యరాత్రి గొంగడికి నిప్పంటుకోగా.. కాళ్లు సహకరించకపోవడంతో లేవలేని పరిస్థితిలో అక్కడికక్కడే ఆహుతయ్యాడు.
చలికి 18 మంది మృతి
సాక్షి నెట్‌వర్క్: చలి తీవ్రతకు బుధవారం 18 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మంది, కరీంనగర్ జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పెథాయ్ తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment