పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవ్వడమేగాక ఈజీగా బరువు తగ్గుతారు. అలాంటి ఈ పెసరపప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ? తాపాన్ని ఎలా పోగొట్టగలదు అంటే..
పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు వేసవి కాలం కాబట్టి.. పెసర పప్పు తినడం చాలా మంచిది. పెసర పప్పుతో కూరలు, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్ వంటివి కూడా తయారు చేస్తారు. అయితే ఈ పెరస పప్పుతో ఏం చేసినా రుచిగానే ఉంటాయి. పెసర పప్పు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే..
బరువు తగ్గడంలో..
పెసర పప్పును తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా తిన్నా.. త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. అంతే కాకుండా చిరు తిళ్లను కూడా తినడం నివారిస్తుంది. అంతే కాకుండా పోషకాలు కూడా అన్నీ శరీరానికి అందుతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.
అలసట, నీరసం నుంచి..
పెసర పప్పులో పోషకాలు అనేవి అధికంగా లభ్యమవుతాయి కాబట్టి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరగడం వల్ల.. సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అందులోనూ వేసవిలో ఎక్కువగా అలసట, నీరసం వస్తాయి. పెసరపప్పు తినడం వల్ల.. అలసట లేకుండా ఉండొచ్చు.
గుండె జబ్బుల ప్రమాదం..
గుండెకు పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పెసరపప్పు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల పెసరపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మ సంరక్షణ కోసం..
పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉండటం వల్ల.. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జుట్టు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. దీంతో జుల్లు రాలడం అనేది తగ్గుతుంది. అదే విధంగా చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
అదీగాక ఈ వేసవి ప్రారంభంలోనే చైత్రమాసం మొదలవుతుంది. తెలుగు వాళ్ల కొత్త సంవత్సరం, శ్రీరామ నవిమి మొదలయ్యేది కూడా ఈ నెలలోనే. అందువల్ల దేవుళ్లకు కూడా పెసరపప్పుతో చేసిన ప్రసాదాలే పెట్టడం జరగుతుంది. బహుశా ఈ కాలానికి తగ్గట్టు ఈ నియమం పెట్టి ఉంటారు. భగభగమండే ఎండల్లో శక్తిని, చలువ నిచ్చే పెసరప్పు మంచిదని గుర్తించే దానితో చేసే వంటకాలను చేసేవారు కాబోలు.
Comments
Please login to add a commentAdd a comment