ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట! ఇది ప్రోటీన్‌ కాదట.. | This lentil Eats Human Flesh Its Not Protein | Sakshi
Sakshi News home page

ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట! ఇది ప్రోటీన్‌ కాదట..

Published Mon, Jan 6 2025 4:56 PM | Last Updated on Mon, Jan 6 2025 5:33 PM

This lentil Eats Human Flesh Its Not Protein

భారతీయ ఇళ్లలో పప్పులు లేనిదే వంట సంపూర్ణం కాదు. ఏదో ఒక విధంగా పప్పులను వినియోగిస్తాం. అలాగే వారంలో ఏ రెండు లేదా మూడు రోజులైనా భోజనంలో పప్పు ఉండాల్సిందే. అయితే పప్పు అనేది ప్రోటీన్ల మూలకమని, ఎన్నో మాంసకృత్తులు ఉంటాయని విన్నాం. కానీ ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట. ఇది ప్రోటీన్‌ మూలం కాదట. వాట్‌ పప్పులు మనిషి మాంసాని తినడం ఏమిటి..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఐఏఎస్‌ ఇంటరర్వ్యూలో ఓ అభ్యర్థికి ఎదురైన ప్రశ్న ఇది. ఔను మనిషి మాంసాన్ని తినేసే పప్పు ఏది అని ప్రశ్నించారట. కాబట్టి ఆ పప్పు రకం ఏంటి..?దాని కథాకమామిషు గురించి చూద్దామా

భారతీయ ఇళ్లలో సాధారణంగా పెసర పప్పుని ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా పండుగల టైంలో ఈ పప్పుతో చేసే వంటకాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఏకాదశి వ్రతాలు చేసేవాళ్లు నియమానుసారంగా నీళ్లు, పాలు, పండ్లు తప్ప ఘన పదార్థాలు తీసుకోకూడదు. కానీ నిష్టగా చేయలేని వాళ్లు లేదా ఉపవాసానికి ఆగలేని వాళ్లు ఈ పెసరపప్పుతో చేసిన అత్తెసర లేదా హవిష్యాన్నం తిని ఉండొచ్చని వేదాలు చెబుతున్నాయి. అంతలా భారతీయ వంటకాల్లో అగ్రస్థానంలో ప్రాధాన్యత కలిగినది ఈ పెసరపప్పు. 

ఇంతకి పెసరపప్పు(Moong Dal) మనిషి మాంసాన్ని తింటుదా..? అని విస్తుపోకండి. ఎందుకంటే దీన్ని అలా అనడానికి వెనుకున్న శాస్త్రీయ కోణం గురించి సవివరంగా తెలుసుకుందాం.

"ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు"గా పలిచే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ ఉంది. ఈ ఎంజైమ్‌లు మన జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. స్తంభించి ఉన్న కొవ్వు, చనిపోయిన కణాల రూపంలో ఉండే అశుద్ధ మూలకాలు, చెత్తని తొలగించడం వాటి ప్రధాన విధి. 

పెసర పప్పు "మానవ మాంసాన్ని తింటాయి" అనగానే మన శరీర మాంసాన్ని తింటుందని కాదు, శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు, అదనపు కొవ్వును తినేస్తుందని అర్థం. బరువు తగ్గడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా మార్చడానికి పెసరపప్పు చాలా మంచిదని చెప్పడానికీ ఇదే రీజన్‌ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఆరోగ్య ప్రయోజనాలు:

  • బరువు తగ్గడం: ఊబకాయం ఉన్నవారికి పెసర పప్పు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఎందుకంటే ఇందులో  ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్‌, వ్యర్థపదార్థాలు​ చూడటానికి మాంసం మాదిరిగా కనిపిస్తాయి. అందుకని ఇలా అనడం జరిగిందని చెబుతున్నారు నిపుణులు. 

  • ఇది శరీరాన్ని మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది. పైగాఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.ఇది అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

  • రక్తపోటును నియంత్రిస్తుంది: పెసర పప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

  • ఇందులో పొటాషియం , మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

  • పోషణ , జీర్ణశక్తి: పెసర పప్పు చాలా పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేదిగా పరిగణిస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉపయోగపడే బలవర్ధకమైన పప్పు ఇది. అన్ని వయసుల వారు హాయిగా తీసుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా పేర్కొంటారు. 

శరీరంలోని కొవ్వు, మలినాలను తొలగిస్తుందని ఇలా మానవ మాంసాన్ని తినేసే పప్పుగా పేర్కొన్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, సురక్షితమైనది కూడా. ముఖ్యంగా శాకాహారులు హాయిగా తీసుకునే మంచి బలవర్ధకమైన పప్పు ధాన్యంగా చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement