విశాఖవాసుల్ని బెంబేలెత్తిస్తున్న వడగాల్పులు! | Heat waves giving troble to Visakhapatnam people | Sakshi
Sakshi News home page

విశాఖవాసుల్ని బెంబేలెత్తిస్తున్న వడగాల్పులు!

Published Tue, Jun 17 2014 4:16 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Heat waves giving troble to Visakhapatnam people

విశాఖ: పగటి ఉష్టోగ్రతలు పెరగడం విశాఖవాసుల్ని బెంబేలెత్తిస్తోంది. విశాఖపట్నంలో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు కారణంగా వడగాల్పులతో విశాఖవాసులు  అల్లాడుతున్నారు. 
 
ఉత్తర, కోస్తా జిల్లాలకు నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  క్యుములోనింబస్ మేఘాలతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
గత రెండు రోజులుగా విశాఖతోపాటు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా నమోదయ్యాయి. కేవలం పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాల్పులకు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement