ఓర్వకల్లు: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మరో ముగ్గురు వడదెబ్బకు గురై మృతి చెందారు. ఓర్వకల్లు గ్రామంలో స్థానిక పెండేకంటి నగర్‌లో నివాసముంటున్న జల్ల నాగరాజు (46) 15 సంవత్సరాల నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చిరు వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పది రోజుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా ఎండ తీవ్రతకు తట్టుకోలేక మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. శనివారం.. రోజు మాదిరిగానే మళ్లీ బస్టాండ్‌కు చేరుకుని వ్యాపారం చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజమ్మ ఉన్నప్పటికీ కుటుంబ కలహాలతో వేర్వేరుగా నివసిస్తున్నారు.
పది రోజుల్లో కుమారుడి పెళ్లి.. వడదెబ్బతో తండ్రి మృతి
వెల్దుర్తి రూరల్: పది రోజుల్లో కుమారుడి పెళ్లి ఉండగా వడదెబ్బతో తండ్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నర్సాపురంలో శనివారం చోటు చేసుకుంది. నర్సాపురం గ్రామ పంచాయతీ 4వ వార్డు మెంబర్ దేవనకొండ కిష్టన్న(60)కు భార్య రామలక్ష్మమ్మ, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల్లో కుమారుడి పెళ్లి నిశ్చయమైంది. ఓ వైపు పెండ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొలంలో కంది కొయ్యలు పాస్తుండడంతో శనివారం కిష్టన్న ఉదయం పొలానికి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తూ ఎండవేడికి అస్వస్థతకు గురై గ్రామ శివారులో పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో అతడిని కర్నూలు ప్రభుత్వాస్పుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు.
ఉపాధి కూలీ మృతి
పత్తికొండ రూరల్: పెద్దహుల్తి గ్రామంలో వడదెబ్బతో ఉపాధి కూలీ అయ్యన్న (62) వడదెబ్బకు గురై మృతి చెందాడు. శనివారం రోజులాగానే ఉపాధి పనులకు Ððవెళ్లి ఎండవేడిమితో అస్వస్థతకు గురై ఇంటికొచ్చాడు. కొద్ది సేపికి సొమ్మసిల్లి పడిపోవడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడు అయ్యన్నకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
వడదెబ్బకు ముగ్గురు మృతి
Published Sat, Apr 15 2017 11:50 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement