నిజామాబాద్, ఆదిలాబాద్‌ల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి పూట చలి తీవ్రత కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో సాధారణం కంటే 5 డి గ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. హన్మకొండలో సాధారణం కంటే 5 డిగ్రీలు అదనంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మెదక్, మహబూబ్‌నగర్‌లలో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ సాధారణం కంటే 4 డిగ్రీ లు అదనంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలు కాగా, భద్రాచలంలో 20 డిగ్రీలు, హన్మకొండలో 18, హైదరాబాద్‌లో 17, ఖమ్మంలో 20, మహబూబ్‌నగర్‌లో 19, మెదక్, రామగుండంలో 15, నల్లగొండ, నిజామాబాద్‌లలో 18 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
Published Mon, Feb 1 2016 3:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement