
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: కోస్తా తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు కోస్తా తీరంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో 40 నుంచి 45 డిగ్రీలు, ఉత్తర కోస్తాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యె అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.