
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పగటి, రాత్రివేళల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ఆదివారం నగరంలో పగటిపూట 31.7 డిగ్రీలు, రాత్రివేళల్లో 19.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణ సగటు కంటే ఏకంగా నాలుగు డిగ్రీలు అధికం కావటంవిశేషం. ఇదిలా ఉంటే మాల్దీవులలో ఏర్పడ్డఉపరితల ఆవర్తనం కూడా ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.