
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రానికి దక్షిణ, నైరుతి దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని సూచించింది.