సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈదురు గాలులు, ఉరుములు..పిడుగులతో తెల్లవారుజాము దాటాక కూడా పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది. చాలావరకు ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపై కూడా నీరు నిలిచిపోయింది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఈదురు గాలుల ప్రభావంతో నగరంలోని పలు ఏరియాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్, మోహదీపట్నం, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, గచ్చిబౌలి.. ఇలా చాలా ఏరియాల్లో వర్షం పడింది.
మరోవైపు ఇంకో రెండు, మూడు రోజులు ఇలాంటి వానలే పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం.. ఓ మోస్తరు నుంచి భారీగానే పడొచ్చని హెచ్చరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment