సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం.. పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వాన పడింది. అలాగే వరంగల్‌లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ ఉదయం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాలోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడడంతో.. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ పలు జిల్లాలకు వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. జూన్ 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగవచ్చని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కూడా.
ఇక.. వర్షాలతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసింది. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లలో అధికారుల అలసత్వంతో వల్ల తాము నష్టపోతున్నామంటూ వాపోతున్నారు.
ఇదీ చదవండి: ఆగిన సీతమ్మ సాగర్ పనులు!
Comments
Please login to add a commentAdd a comment