wind storms
-
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన.. రాబోయే 24 గంటల్లో..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం.. పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వాన పడింది. అలాగే వరంగల్లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ ఉదయం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాలోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడడంతో.. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ పలు జిల్లాలకు వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. జూన్ 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగవచ్చని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కూడా. ఇక.. వర్షాలతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసింది. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లలో అధికారుల అలసత్వంతో వల్ల తాము నష్టపోతున్నామంటూ వాపోతున్నారు. ఇదీ చదవండి: ఆగిన సీతమ్మ సాగర్ పనులు! -
మహాకాల్ లోక్‌లో బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
ఉజ్జయిని: హఠాత్తుగా మొదలైన ఈదురు గాలులు, ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో విధ్వంసం సృష్టించింది. అదే సమయంలో.. మహాకాళ్ లోక్ ఆలయ ప్రాంగణంలో పిడుగు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమందికి గాయాలు కాగా, అక్కడ ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి కురిసిన వర్ష బీభత్సానికి ఉజ్జయిని అతలాకుతలం అయ్యింది. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడగా.. చాలాచోట్ల కరెంట్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వారాంతం కావడంతో.. ఆదివారం పాతిక వేల మందికి పైగా మహాకాళ్ లోక్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. భారీగా సందర్శకులు మహాకాళ్ లోక్కు రాగా.. ఆ సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసున్నారు. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాలుల ధాటికి ఆలయ కారిడార్‌లో ఏర్పాటు చేసిన సప్తరుషి విగ్రహాలు పక్కకు జరిగాయి. అందులో రెండు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ కారిడార్‌లో మొత్తం 155 విగ్రహాలు ఉండగా.. దెబ్బ తిన్న విగ్రహాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) చెబుతున్నారు.మహాకాల్ లోక్ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కిందటి ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అపూర్వం.. అమోఘం.. మహాకాళ్ లోక్ (ఫొటోలు) -
TS: మరో రెండు రోజులు మెరుపులు, ఈదురు గాలులలో వానలు
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక పరిసర ప్రాంతాల మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంసముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇక, దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. -
అకాల వర్షానికి భారీగా పంట నష్టం
-
తెలంగాణలో వర్ష బీభత్సం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ గాలులతో వర్షం పడుతోంది. వర్షబీభత్సానికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. భీకర గాలులకు చేతికందిన మామిడి పంట నేలరాలింది. హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతారణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఖైరతాబాద్, బషీర్‌బాగ్, నారాయణ గూడ, అబిడ్స్, కోఠి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, ట్యాంక్‌బండ్, కర్మన్‌ఘాట్, నాచారం, తార్నాక, ఓయూ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ప్రాంతాల వారిగా వర్షపాతం రాజేంద్రనగర్ 3.31 సెం.మీ ముషీరాబాద్ 2.9 సెం.మీ బాలానగర్ 2.3 సెం.మీ మారేడుపల్లి 2.2 సెం.మీ వరంగల్ అర్బన్ : వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో కొద్దిసేపు జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రవాణ, విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోయాయి. రోడ్లపైన విరిగిపడ్డ చెట్లను తొలగించి, విద్యుత్ స్తంబాలు, తీగలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, నగర కమీషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలో చెట్లు, విద్యుత్ తీగలు, స్థంబాల పడిపోతే కార్పొరేషన్ అధికారులకు తెలియజేయాలని వారు ప్రజలను కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004251980 నెంబర్ కి కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. వరంగల్ అర్బన్ 5 సెం.మీ, వరంగల్ రూరల్ 4 సెం.మీ, భూపాలపల్లి 4 సెం.మీ, దామెర, ములుగు 3.6 సెం.మీ వర్షపాతం నమోదయింది. ఇద్దరు మృతి వరంగల్‌లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు మృతి చెందారు. భీమ దేవరపల్లిలోని మల్లారంలో పిడుగుపాటుకు గురై తోడేటి కట్టయ్య అనే రైతు మృతి చెందాడు. మరోచోట గోడకూలి అయోధ్య అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, ములుగు, వర్గల్ మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, చెన్నూరులో ఈదురుగాలులతో వర్షం పడింది. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్‌లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల కారణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. రాజధాని నగరంలో ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
తిరుమలలో ఈదురుగాలుల బీభత్సం
తిరుమల: తిరుమలలో సోమవారం మధ్యాహ్నం వాతావారణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. దీంతో భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో.. జనజీవనం ఒక్కసారిగా స్తంభించి పోయింది. భారీగా వీస్తున్న గాలులకు వృక్షాలు నేలకూలుతున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వృక్షాలు నెలకూలాయి. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అటవి అధికారులు తెలిపారు. నేలకొరిగిన వృక్షాలను అటవీశాఖ అధికారులు తొలగిస్తున్నారు.