తిరుమలలో సోమవారం మధ్యాహ్నం వాతావారణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది.
తిరుమల: తిరుమలలో సోమవారం మధ్యాహ్నం వాతావారణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. దీంతో భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో.. జనజీవనం ఒక్కసారిగా స్తంభించి పోయింది. భారీగా వీస్తున్న గాలులకు వృక్షాలు నేలకూలుతున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వృక్షాలు నెలకూలాయి. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అటవి అధికారులు తెలిపారు. నేలకొరిగిన వృక్షాలను అటవీశాఖ అధికారులు తొలగిస్తున్నారు.