సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక పరిసర ప్రాంతాల మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంసముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
ఇక, దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment