
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక, రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ద్రోణి తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Moderate Rainfall Recorded at Nirmal & Nizamabad.
Upto 2:00 Am Nirmal 20.3 mm Rainfall#TelanganaRains pic.twitter.com/GPi65UJqZf— Telangana Weather Forecast....🛰⛈️ (@SkyForecastMaN4) March 20, 2025
మరోవైపు.. ఇప్పటికే గురువారం రాత్రి పలు జిల్లాలో వర్షం కురిసింది. జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర పంట నష్టం జరిగే అవకాశం ఉంది.

Weather update!!
Now scattered thunder storm rains going in nizamabad, Nirmal district later into jagtial places cover 🌧️— Telangana state Weatherman (@tharun25_t) March 20, 2025
ఇక, ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి కారణంగా గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment