Orange Alert
-
ఏపీకి మరో గండం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: వాయుగండం ముప్పు తొలగిపోయిందని ఏపీ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈనెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు ఉన్నాయి. వచ్చే 24 గంటల్లో కృష్ణ, గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.. దీంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు,బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. -
హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్..
-
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
Telangana: కరువుతీరా వర్షాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కరువుతీరేలా.. వరుణుడు కరుణించాడు. వానాకాలం ప్రారంభమైన నలభై రోజుల అనంతరం ఒకేసారి రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు వాగులు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. శనివారం జిల్లాల వారీ గణాంకాలు పరిశీలిస్తే.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 4.19 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 12.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా అంతటా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా రెండురోజులుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ముసురు వాన ఉండడంతో పలుచోట్ల వరి నారుమడులు, పత్తి చేన్లలో వరద నీరు నిలిచింది. పలుచోట్ల చెరువులు నిండి అలుగు పోస్తుండగా అక్కడక్కడా రహదారులు, లోలెవల్ బ్రిడ్జిలపైకి వరద చేరింది. ఉధృతంగా జంపన్న, ముసలమ్మ వాగులు ములుగు జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, ఎలిశెట్టి గ్రామాల సమీపంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర పడవలను ఏర్పాటు చేశారు. ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్న వాగు ఉధృతి ఎక్కువ కావడం, దబ్బగట్ల శైలజ, పులిసె అనూష అనే గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో వారిని పడవల్లో వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌కు 6 కిలోమీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురవుతుండటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మంగపేట మండలంలోని రాజుపేట ముసలమ్మవాగు వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుండటంతో ఒడ్డు వెంట నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాజేడు మండల పరిధిలోని కొప్పుసూరు గుట్టల వద్ద ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతుల్వాయి సమీపంలోని బొర్రవాగు, గుండ్రాత్‌పల్లి సమీపంలోని అలుగువాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కాజ్‌వేల పైనుంచి వెళ్తుండడంతో పలు గ్రామాలకు మండలం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పత్తి చేలల్లోకి వరద నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వర్షాలతో మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ, 6 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. గోదావరిలో కలెక్టర్, ఎస్పీ బోటు ప్రయాణం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పలిమెల మండలాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పర్యటించారు. గోదావరిలో బోటులో ప్రయాణించి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మూరుకు చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్రి–సాంగిడి దారి మూసివేత ఎడతెరిపిలేని వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఉమ్రి వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఉమ్రి–సాంగిడి దారిని పోలీసులు మూసి వేశారు. రెండు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై కొత్త బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, తాత్కాలిక వంతెన గుండానే రాకపోకలు కొనసాగుతున్నాయి. 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలోని ఎల్లంపల్లి, ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ప్రాంతాల్లోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కైరిగూడ, డొర్లి ఏరియాల్లోని ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అత్యధికంగా 65.5మి.మీ వర్షపాతం నమోదైంది. ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ వెళ్లే మార్గంలో రెంకోనివాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో 13.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కమ్మర్‌పల్లిలో 34.3 మిల్లీమీటర్లు, మెండోరాలో 28.0, నవీపేట్లో 27.5, బాల్కొండలో 24.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాలమూరులో ముసురు వాన వనపర్తి జిల్లాలో 2.7 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 2.69, మహబూబ్‌నగర్ జిల్లాలో 2.49, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.04, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.42 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది.ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 4.9 సెంమీ వర్షపాతం నమోదైంది. కొత్తకోట, జడ్చర్ల, ఆత్మకూరులో ముసురు వర్షానికి తడిసిన మట్టి ఇళ్లు కూలిపోయాయి. వీడని ముసురు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా ముసురు కొనసాగుతోంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో శనివారం 1.43 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా కడ్తాలలో అత్యల్పంగా 0.95 సెంటీమీటర్లు నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని పలు వాగులు ఉరకలెత్తుతున్నాయి. సగటు వర్షపాతం కంటే ఎక్కువగా.. శనివారం రాష్ట్రంలో 1.79 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోంది. శనివారం 0.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా జూన్1 నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 26.46 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 33.11 సెంటీమీటర్ల వర్షపాతం (25 శాతం అధికం) నమోదైంది. గతేడాది ఇదే సీజన్లో 32.84 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్లో శనివారం నాటికి రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ములుగు, కరీంనగర్, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. మిగిలిన జిల్లాలో గడిచిన నాలుగు రోజుల క్రితం వరకు సాధారణం కంటే తక్కువ నమోదైనా.. శుక్ర, శనివారాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రకటించింది. వాయుగుండానికి తోడు ఉపరితల ద్రోణి పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం మరింత ముందుకు సాగి ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. నేడు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు!ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. -
బిగ్ అలర్ట్.. ఈ తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక ఇవాళ(శనివారం) సాయంత్రం హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. -
వారంపాటు తీవ్ర వడగాడ్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకుతోడు పొడి వాతావరణం, దక్షిణ, నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఈ నెల 6 వరకు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడక్కడా తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రామగుండం.. అగ్నిగుండం.. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఖమ్మంలో సాధారణం కంటే 3.6 డిగ్రీలు, భద్రాచలం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.1, కొల్వాయ్ 46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లోకెల్లా ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
అధిక ఉష్ణోగ్రత... ఆపై ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాడుపగిలే ఎండ, వడగాడ్పులు... మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. ఇదీ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ♦ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రచండ భానుడు.. రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లురులో 45.2 డిగ్రీల సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 3.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మిగతా ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్దలు, పిల్లలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.ఆకు రాల్చిన అభయారణ్యం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల అభయారణ్యం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులకు నిలయమిది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో అన్ని రకాల పక్షుల అలజడితో చూడముచ్చటగా ఉండేది. వేసవిలో మండుతున్న ఎండలతో చెట్లన్నీ ఆకురాలడంతో అటవీ ప్రాంతమంతా బోసిపోయి ఇలా కనిపిస్తోంది. – నర్సంపేట -
తెలంగాణ:నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఎల్లో అలర్ట్: ఈ పనులు అస్సలు చేయకండి!
వేసవి కాలం అన్నాక ఎండలు సాధారణమే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మండే ఎండలు, తీవ్రమైన ఉష్ట్రోగ్రతలనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు 43°Cకి పెరగడంతో తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. Serious heat continues for 7th straight day 🔥🥵 More 3days to suffer, later we will move into pre monsoon rains, respite from heat from Apr 7 From Apr 6 itself storms will start, North, Central TG to get good storms in coming week 🌧️ One spell ahead in HYD during April 6-9 🌧️ pic.twitter.com/7KXOjnGQof — Telangana Weatherman (@balaji25_t) April 4, 2024 కనీస జాగ్రత్తలు వాతావరణానికి తగ్గట్టుగానే సహజం మన బాడీకూడా రియాక్ట్ అవుతుంది. ఎండకు దాహం వేస్తుంది. చల్లదనాన్ని కోరుకుంటుంది. కానీ వేసవిలో దాహం వేయకపోయినా, వీలైనంత వరకు నీరు తాగుతూ ఉండాలి. ఏ కాస్త అనారోగ్యంగా అనిపించినా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసంలో సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి కనుక శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసి పోయినప్పుడు బాగా పనిచేస్తుంది. అలాగే ఉప్పు కలిపి నిమ్మరసం, మజ్జిగ/లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇంట్లోనే తయారుచేసిన పానీయాలైతే ఇంకా మంచిది. తొందరగా వంట ముఖ్యంగా ఈ వేసవికాలంలో వంట ఎంత తొందరగా పూర్తి చేసుకొని అంత తొందరగా బయటపడితే మంచిది. లేదంటే ఆ వేడికి, ఉక్క బోతకు చెప్పలేనంత నీరసం వస్తుంది. దాదాపు 10 గంటలలోపు వంట ఇంటి నుంచి బయపడాలి. బాగా వెంటిలేషన్ ,చల్లని ప్రదేశాలలో ఉండండి. సాధ్యమైనంతవరకు ఎండకు బయటికి వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు. మరీ తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దు. ఒక వేళ వెళితే ఉదయం 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తరువాత బైటి పనులకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎండలో బయటి వెళ్లి..తిరిగి వచ్చిన వెంటనే హడావిడిగా నీళ్లు తాగవద్దు.. కాస్త నెమ్మదించి, మెల్లిగా నీటిని తాగండి. అలాగే మరీ చల్లని నీళ్లను కూడా తాగకూడదు. ఆహారం పుచ్చకాయ, తర్బూజ నారింజ, ద్రాక్ష, పైనాపిల్ లాంటి పండ్లతోపాటు, నీరు ఎక్కువగా ఉండే అన్ని రకాల ఆకు కూరలు, దోసకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, టమాటా లాంటి కూరగాయలు తీసుకోవాలి. వేపుళ్లు, మసాలాల వాడకాన్ని కూడా తగ్గించాలి. పగటిపూట కిటికీలు , కర్టెన్లను మూసి వేయాలి. రాత్రికి చల్ల గాలికి తెరిచి పెట్టండి. దోమలు రాకుండా దోమలు తెరలు తప్పనిసరి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు మర్చిపోకూడదు. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండనుంచి కాపాడుకునేలా తలను టవల్ , స్కార్ప్, టోపీ, చున్నీతో కప్పుకోవాలి. ఈ పనులు మానుకోండి ♦ ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటికి రావద్దు. ♦ ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బాగా ఎక్కువ కష్టపడవద్దు. కాసేపు నీడ పట్టున ఉండి విశ్రంతి తీసుకోండి. ♦ చెప్పులు, గొడుగు లేకుండా బయటకు వెళ్లవద్దు. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ , కార్బోనేటేడ్ శీతల పానీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ♦ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, మాంసాహారాన్ని మితంగా వాడండి. నిల్వ ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు ♦ పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు. ఇలా చేయడం వేడికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అప్రమత్తత విపరీతమైన తలనొప్పి, జ్వరం, నీరసం, వాంతులు, విరోచనలు, గందరగోళం, మూర్చ, కోమా లాంటి సమస్యలను కనిపిస్తే వెంటనే సమయంలోని వైద్యులను సంప్రదించండి. ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆరుబయట పనిచేసే వ్యక్తులు; గర్భిణీ స్త్రీలు; మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు; శారీరకంగా అనారోగ్యం ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు,వృద్ధులను కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. -
ఆ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవులు!
చెన్నై: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కేరళలో ఈ రెండు రోజులు(బుధ, గురువారాలు) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు.. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కేరళ, తమిళనాడులో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జనం అవస్థలు పడుతున్నాయి. కాలనీల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
తెలంగాణలో మరో మూడు రోజులు కుండపోత.. వాన దంచికొట్టే జిల్లాలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న మూడురోజులు (జులై 25,26,27) రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రోజున హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. (చదవండి: విద్యాసంస్థలకు సెలవులు పొడిగించేనా!) జులై 25, మంగళవారం ⇒ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం. ⇒ భారీ నుంచి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం. ⇒ భారీ వర్షాలు జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం. ⇒ తెలంగాణ రాష్ట్రంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. ⇒ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, కర్నాటకలనూ భారీ వర్షాలు కురిసే అవకాశం. రాయలసీమ, కర్నాటకలోనూ భారీ వర్షాలకు అవకాశం. (చదవండి: Snake On TVS Bike: ద్విచక్రవాహనం ఎక్కిన పాము..) -
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. రెండు రోజులు మళ్లీ భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం శనివారం బలహీనపడటంతో వానలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ సమీపంలోని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో విస్తారంగా వానలు పడతాయని అంచనా వేసింది. ఇదే సమయంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు 25, 26 తేదీలకు సంబంధించి రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 10 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.8 సెంటీమీటర్ల సగటు వాన కురిసింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వానలు పడ్డాయి. ఇది కూడా చదవండి: కడెం.. జనం గుండెల్లో సైరన్! -
వదలని వాన.. వరదలా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని నాలుగో రోజూ వానలు ముంచెత్తాయి. రాజధాని హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో పొద్దుమాపు ముసురుపట్టింది. పలుచోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటం, గ్రామాలు జలదిగ్బంధం కావడం, రహదారులపై నీరు చేరడం, ముసురుతో ఇంట్లోంచి బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. ఇదే సమయంలో భారీ వర్షాలతో సాగునీటికి కష్టాలు తీరుతాయంటూ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారంతా వ్యవసాయ పనులు ముమ్మరం చేయడంలో నిమగ్నమవుతున్నారు. ఇక మరో రెండు రోజుల పాటు వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఒక్కరోజే సగటున 3.45 సెం.మీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే సగటున 3.45 సెంటీమీటర్ల వాన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా మెదక్ జిల్లాలో సగటున 9.46 సెంటీమీటర్లు, జనగామ జిల్లాలో 9.04 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 8.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలే కురిశాయి. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. స్తంభించిన జనజీవనం.. నాలుగు రోజులుగా ముసురుపట్టే ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాజేడు మండలం టేకులగుడెం వద్ద జాతీయ రహదారి మునిగిపోవడంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముసురు ప్రభావంతో ఓపెన్‌కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తినిలిచిపోయింది. హైదరాబాద్‌లో రోజంతా వాన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం రోజంతా వాన కురిసింది. చాలా కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీనితో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ తీగలు తెగడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పదుల సంఖ్యలో పాత ఇళ్లు కూలిపోయాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా మల్కాజిగిరిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏడెనిమిది సెంటీమీటర్లకుపైగానే వాన కురిసింది. ఉప్పొంగిన వాగులు.. రాకపోకలు బంద్ ♦ సంగారెడ్డి జిల్లాలోని ఫతేపూర్– పిట్ల రోడ్డులోని తాత్కాలిక వంతెన తెగిపోయింది. మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నల్లవాగు పొంగి ప్రవహిస్తోంది. ♦ మెదక్ జిల్లా వెల్దుర్తిలో డబుల్ బెడ్రూం ఇళ్లు జలమయం అయ్యాయి. రామాయంపేట– సిద్దిపేట రహదారిపై కోనాపూర్ వద్ద వరద చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఘనపురం వాగు ఉప్పొంగడంతో ఏడుపాయల వనదుర్గ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ♦ సిద్దిపేట జిల్లాలో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో హన్మకొండ– సిద్దిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ♦ కుమురంభీం జిల్లాలో దహెగాంలో పెద్దవాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. పాటగూడ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెన కోతకు గురైంది. ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లా టేకులగూడెం సమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు బారికేడ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ♦ వరంగల్ నగరంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోటు నుంచి అధిక వర్షపాతానికి.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు దాటిపోయినా వానలు సరిగా కురవలేదు. ఇటీవలి వరకు 30శాతానికిపైగా లోటు వర్షపాతం కొనసాగింది. కానీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మారింది. లోటు పూడిపోవడమేగాక 6 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. వానాకాలం సీజన్లో జూలై 20 నాటికి 26.46 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం నాటికి 27.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అధికంగా, 21 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవగా.. మిగతా 5 జిల్లాల్లో మాత్రం కాస్త లోటు ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. మరో రెండు రోజులూ వానలు వాయవ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనమూ ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. -
వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం, మరోవైపు అల్పపీడనం కారణంగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అంచనావేసింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వెల్లడించింది. రెండు రోజులు (గురువారం, శుక్రవారం) మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. (చదవండి: వాన లోటు తీరినట్టే!) కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్) -
హిమాచల్‌లో భారీ వానలు.. వరదల్లో చిక్కుకున్న టూరిస్టులు..
సిమ్లా: ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా, మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయని దీంతో టూరిస్టులు కూడా వరదల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. భారీ వర్షాల కారణంగా బాగిపుల్ ప్రాంతంలోని ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు మండి ప్రషార్ రోడ్‌లోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారు. చంబా నుండి వచ్చిన విద్యార్థుల బస్సు పరాశర్ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ సూద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుండి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు వెల్లడించారు. Cloudburst triggers flash floods in Mandi, Himachal Pradesh. Landslides Force Closure Of Pandoh-Mandi Highway VC: Deputy Commissioner Mandi#India #Himachal #Mandi #Cloudburst #Rains #Extreme #Floods #Storm #HimachalPradesh #Landslide #Flooding #Viral #Weather #Climate… pic.twitter.com/kqvAqG1qhb — Earth42morrow (@Earth42morrow) June 25, 2023 ఇదిలా ఉండగా.. పంచకులలో ఓ కారు వరదనీటిలో కొట్టుకుపోగా ఓ మహిళను స్థానికులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. Damage reported in #Seraj Valley due to Flash Flood#HimachalPradesh #Monsoon pic.twitter.com/AJc4RQEqdX — Weatherman Shubham (@shubhamtorres09) June 25, 2023 Scary visuals emerged from Khark Mangoli Panchkula, where a lady's car was swept away by the sudden excessive water flow in the river, while parked nearby. Hats off to the people who came to their rescue. The lady along with her mother came to pay obeisance at a Temple. pic.twitter.com/Mh24O92rHJ — Gagandeep Singh (@Gagan4344) June 25, 2023 ఇది కూడా చదవండి: పెళ్లింట పెను విషాదం.. -
ఏపీ: తీవ్రమైన వడగాల్పులతో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాలం వచ్చినా.. వేసవి తాపం నుంచి భారత్ ఊరట పొందడం లేదు. రుతుపవనాలు ప్రవేశించినా కూడా పలు రాష్ట్రాల్లో ఇంకా తొలకరి పలకరింపు జరగలేదు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో తీవ్ర నుంచి అతితీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడా వర్షాలు పడినప్పటికీ.. చాలావరకు ఆయా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాలనైతే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఏపీ విషయానికొస్తే.. దాదాపు 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. 23 మండలాల్లో మరీ తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. పెద్దలు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు.. అవసరమైతేనే బయటకు రావాలని, డీహైడ్రేషన్ నేపథ్యంలో దాహం వేయకున్నా నీరు తాగాలని వైద్య నిపుణులు సూచించారు. ఇక బాపట్ల, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది ఐఎండీ. బిపర్జోయ్ తుపాను బలహీనపడడం, మరో 12 గంటలపాటు పరిస్థితి కొనసాగేలా కనిపిస్తుండడంతో.. రేపు సాయంత్రానికిగానీ, ఎల్లుండికిగానీ ఏపీలో రుతుపవనాల ప్రభావం కనిపించొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇదీ చదవండి: జూన్ మూడోవారంలోనూ నిప్పుల కొలిమిలా తెలంగాణ -
కొండచరియల బీభత్సం చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు..!
-
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన.. రాబోయే 24 గంటల్లో..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం.. పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వాన పడింది. అలాగే వరంగల్లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ ఉదయం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాలోనూ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడడంతో.. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ పలు జిల్లాలకు వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. జూన్ 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగవచ్చని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కూడా. ఇక.. వర్షాలతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసింది. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లలో అధికారుల అలసత్వంతో వల్ల తాము నష్టపోతున్నామంటూ వాపోతున్నారు. ఇదీ చదవండి: ఆగిన సీతమ్మ సాగర్ పనులు! -
తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. పొద్దంతా ఎండ తీవ్రంగా ఉన్నా.. సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి వానలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ బాగా తగ్గి చలి వేస్తోంది. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల ఈ పరిస్థితి కనిపించగా.. మరో మూడు రోజులూ ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ చుట్టూ భారీగా.. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికితోడు రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజులు హైదరాబాద్, పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలుచోట్ల సగటున 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు కుండపోత వానలు పడొచ్చని ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పలుచోట్ల వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వానలే.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒక్కరోజే రాష్ట్రంలో సగటున 2.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా వానాకాలంలోనే ఇలా వర్షపాతం నమోదవుతుంది. అలాంటిది ఈసారి నడి వేసవిలో కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో 0.02 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఏకంగా 2.32 సెంటీమీటర్లు కురవడం గమనార్హం. ప్రాంతాల్లో సిద్దిపేట.. జిల్లా సగటులో నారాయణపేట అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 10 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 9, భువనగిరిలో 9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇక జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. నారాయణపేటలో 4.5 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 4.48, యాదాద్రి భువనగిరిలో 3.88, వికారాబాద్ 3.66, మహబూబ్‌నగర్ 3.54, జోగుళాంబ గద్వాలలో 3.49 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తగ్గిన ఉష్ణోగ్రతలు వరుస వానల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం గరిష్టంగా నల్లగొండలో 38.5 డిగ్రీలుగా నమోదవడం గమనార్హం. ఇక హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలకు పడిపోయింది. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకన్నా తక్కువగానే నమోదవుతాయని, పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. -
తెలంగాణాలో మండుతున్న ఎండలు
-
హైదరాబాద్‌లో వడగళ్ల వాన
-
హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం పడింది. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల అవర్తనం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు వడగళ్లు, ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40 నుండి 50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. ఈటలకు బిగ్ షాక్! -
రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల వర్షాలు తెరిపినిచ్చాయి. శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయలేదు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. బలహీనపడ్డ అల్పపీడనం: ఒడిశా, కోస్తాంధ్ర పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో మూడు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సీజన్లో 52.49 సెంటీమీటర్ల వర్షపాతం: ఏటా నైరుతి సీజన్లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అందులో జూలై 14కి 22.66 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి ఏకంగా 52.49 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. అంటే మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో మూడింట రెండొంతులు ఇప్పటికే కురిసినట్టు తెలిపింది. -
మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మూడు రోజులపాటు ఇలాగే
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నేటి (జూలై 6) నుంచి 8 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఐఎండీ శుక్రవారం వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.ఇప్పటికే ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముంబై రహదారులపై, సబ్ వేలలో వర్షపు నీరు చేరడంతో వాహనాలను దారిమళ్లించాల్సి వస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాలు తెరిపిలేకుండా కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇరుకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరీ, సైన్, చెంబూర్, కుర్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో అనేక చోట్ల వాహనాలను దారి మళ్లించారు. న్యూ ముంబైలోని ఖాందేశ్వర్ రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్ జలమయమైంది. సాన్‌పాడా రైల్వే స్టేషన్ దిశగా వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఆటోలు ముందుకు వెళ్లలేకపోయాయి. దీంతో ప్రయాణికులు కాలినడకన ముందుసాగారు. ముంబై, థానే, ఉప నగరాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే సూచించారు. నదులు, చెరువులు, నాలాల పరీవాహక ప్రాంతాలపై నిఘా వేయాలని అధికారులను ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం సముద్రంలో మూడు రోజులపాటు హై టైడ్ ఉంటుంది. పెద్దపెద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదముంది. దీంతో జనాలు సముద్ర తీరాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటకుల కష్టాలు.. 24 గంటల నుంచి తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంచ్గంగాలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ఈ నదిపై ఉన్న రాజారాం డ్యాంలో నీటి మట్టం 16 అడుగుల మేర పెరిగింది. కాని మంగళవారం ఉదయం ఈ నీటి మట్టం ఏకంగా 24 అడుగులకు చేరింది. డ్యాంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోవడంతో తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. కాని భారీవర్షం కారణంగా అనేక మంది పర్యాటకులు డ్యాం పరిసరాల్లో చిక్కుకున్నారు. రెస్క్యు టీం పర్యాటకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా కొల్హాపూర్ సిటీసహా జిల్లా లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొల్హాపూర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరఠ్వాడాలోనూ వానలే వానలు.. మరఠ్వాడలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఔరంగాబాద్, జాల్నా, పర్భణీ, నాందేడ్, హింగోళి, లాతూర్, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాలో భారీ వర్షాలతోపాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నా యి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల వల్ల అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అనేక గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒకపక్క వర్షం, మరోపక్క విద్యుత్ సరఫరాలేక ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. అయితే జూన్‌లో పత్తాలేకుండా పోయిన వర్షాలు జూలై ఆరంభంలోనే కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుక్కిదున్ని, విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల చెక్ డ్యాంలు కనిపించకుండా పోయాయి. చిన్న చిన్న వంతెనల మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీంతో కొన్ని గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయా యి. రవాణా సౌకర్యాలు లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా మంగళవారం సీఎస్ఎంటీలో రైళ్లు ఆలస్యం కావడంతో ఫ్లాట్‌ఫాంకు అటూఇటూ భారీగా నిలిచిపోయిన ప్రజలు -
ఆరెంజ్ అలర్ట్: ముంబైలో భారీ వర్షాలు
ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ కుండపోత వర్షాలు కారణంగా నగరం అంతటా రైళ్లు, బస్సు సర్వీసులు దెబ్బతిన్నాయి. ముంబైలోని కుర్లా, చెంబూర్, సియోన్, దాదర్, అంధేరితో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ మేరకు జులై 1, 2 తేదీల్లో ముంబై నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు భారీ నీటి ప్రవాహం, వరదలు కారణంగా ముంబై బీఎంసీ పశ్చిమ శివారులోని అంధేరి సబ్వేని ట్రాఫిక్ కోసం మూసివేసింది. అంతేకాదు పలు చోట్ల మోకాళ్ల లోతునీళ్లు ఉండటంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి నానా ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు ముంబైలోని తూర్పు శివారు ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ఎడతెరిపిలేకుండా వర్షం కురిసిందని, పైగా గత 12 గంటలలో సుమారు 58.40 మిమీ వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా కల్బాదేవి, సియోన్ ప్రాంతాల్లో రెండు భవనం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రభావిత నిర్మాణాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. #WATCH | Rain continues to lash parts of Mumbai. Visuals from near Hindmata, Dadar area pic.twitter.com/oSB7zd9NEr — ANI (@ANI) July 1, 2022 #WATCH Mumbai | Severe waterlogging hindered traffic movement leaving a car stuck in the middle of the road. Last night visuals from near Khodadad Circle, Dadar TT pic.twitter.com/1T9je6Nyvq — ANI (@ANI) July 1, 2022 (చదవండి: కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి) -
భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వద్ద గురువారం అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చదవండి👉🏻 విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే! ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశాల్లో వచ్చే మూడురోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మే తొలివారంలో వర్షాలు పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. బొగ్గు నిల్వలు అడుగంటడంతో థర్మల్ విద్యుత్ తయారీ సంకటంలో పడిందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం గమనార్హం. కొరత కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు షురూ అయ్యాయి. చదవండి👉 క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో -
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
-
AP Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ చేసింది. నాలుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా. కానీ ప్రస్తుతం బ్యాంకాక్ సమీపంలో ఉండడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఏపీలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు. చదవండి: ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో.., తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో మదురై, విరుదునగర్ జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో చెక్‌డ్యాంల నుంచి వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా నేడు రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకి 40 కి.మీ. నుంచి 50 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరద నీటిలోనే చెన్నై
సాక్షి, చెన్నై: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. 10, 11 తేదీల్లో చెన్నై దాని శివారు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనంతో తమిళనాడులో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. దీంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు తదితర 14 జిల్లాల్లో కొన్నిచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై లోతట్టు ప్రాంతాల్లో ఎటు చూసినా మోకాలి లోతులో నీరు నిల్వ ఉండడంతో ఆ పరిసరాల్లోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన మార్గాల్లో వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినా, వీడని వాన కారణంగా అనేక మార్గాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నైలో సహాయక చర్యలు విస్తృతం చేశారు. రెండో రోజు సోమవారం కూడా సీఎం ఎంకే స్టాలిన్ చెన్నై నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఆరణియారు పొంగి పొర్లుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో పిచ్చాటూరు – ఊత్తుకోట – తిరువళ్లూరు మార్గంలో రెండు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కాగా, రాష్ట్రంలో వర్ష సంబంధ ఘటనల్లో నలుగురు చనిపోయారు. -
కేరళను వీడని వర్షాలు
తిరువనంతపురం/డెహ్రాడూన్: కేరళలో పలుప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం సైతం ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు బెంబేలెత్తించాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పత్తనంథిట్ట, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకుళం, త్రిసూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 24 గంటల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉంటే రెడ్అలర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల దాకాకురిసే పరిస్థి తి ఉంటే ఆరెంజ్ అలర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. కేరళలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని (ఉపసంహర ణ దశలో), అందుకే కేరళతోపాటు లక్షదీ్వప్లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంపైకి వెళ్లొద్దని సూచించింది. కేరళలో కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటిదాకా 42 మంది మృతి చెందారు. ఆరుగురు కనిపించకుండా పోయారు. ఉత్తరాఖండ్‌లో వరద నష్టం 7 వేల కోట్లు! కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం ఉత్తరాఖండ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. జల విలయాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వరదల కారణంగా రాష్ట్రంలో రూ.7,000 కోట్ల నష్టం వాటిలినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఏరియల్ సర్వే అనంతరం జోలీగ్రాంట్ ఎయిర్‌పోర్టులో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చురుగ్గా స్పందించడంతో వరదల నష్టాన్ని చాలావరకు నివారించగలిగామని చెప్పారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 65 మంది మరణించడం, 11 మంది కనిపించకుండా పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చార్ధామ్ యాత్ర పునఃప్రారంభం భారీ వర్షాల కారణంగా 18న తాత్కాలికంగా నిలిపివేసిన చార్ధామ్ యాత్ర మళ్లీ ప్రారంభమయ్యింది. రిషికేశ్ చార్ధామ్ బస్ , హరిద్వార్ బస్టాండ్ నుంచి భక్తులు చార్ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అధికారులు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసులను పునరుద్ధరించారు. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. -
తెలంగాణలో మరో 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
-
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
-
‘గులాబ్’ తుపాను: హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్..
సాక్షి, హైదరాబాద్: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం సాయంత్రం 5.30 గంటల సమయంలో ‘గులాబ్’తుపానుగా మారింది. ఇది గోపాల్‌పూర్‌కు 370 కిలోమీటర్లు, కలింగపట్నంకు తూర్పు, ఈశాన్య దిశలో 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను పశ్చి మ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరప్రాంతాల్లోని కలింగపట్నం, గోపాల్పూర్ మధ్యలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 27న ఈశాన్య, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణించి ఈనెల 29న పశ్చిమ బెంగాల్ తీరం వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. -
రోడ్లు జలమయం.. భారీగా నిలిచిన ట్రాఫిక్
-
ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ ఎప్పుడు జారీ చేస్తారో తెలుసా?!
దేశంలో వర్ష సూచన, వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లను జారీ చేస్తారు. వచ్చే 24 గంటల్లో పడే భారీ వర్షాలు, తుఫానులు, ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితిని.. వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని బట్టి ఈ హెచ్చరికలు ఉంటాయి. ఇందులో గ్రీన్ అలర్ట్ అంటే ఎలాంటి ప్రమాదం లేదని అర్థం. మరి.. ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ ఎలాంటి పరిస్థితుల్లో జారీ చేస్తారో తెలుసా?! ఎల్లో అలర్ట్ ఆరు నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తారు. ఆరెంజ్ అలర్ట్ పది నుంచి 20 సెంమీటర్ల వర్షపాతం, 40–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని.. ఇబ్బందులేమైనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్ సూచిస్తుంది. కాగా హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచే వానలు పడుతున్న నేపథ్యంలో.. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రెడ్ అలర్ట్ ఒక రకంగా చెప్పాలంటే కుండపోత వానలు, తుఫాను వంటి ప్రకృతి విపత్తును సూచించడానికి రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అంటే 20 సెంటీమీటర్లకు మించి వాన పడే అవకాశం ఉందని అర్థం. రెడ్ అలర్ట్ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. చదవండి: Telangana: జడివాన..మరో 3 రోజులు కుండపోతే..! -
ఢిల్లీలో భారీ వర్షం, ఆరెంజ్ అలెర్ట్ జారీ
-
ఢిల్లీలో భారీ వర్షం.. అరెంజ్ అలెర్ట్ జారీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. గత 24 గంటల్లో(ఉదయం 8 గంటల వరకు) 138.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతమని భారత వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. భారీ వర్షంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరు చేరడంతో మోటార్లతో అధికారులు వరద నీరు తొలగిస్తున్నారు. చదవండి: మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు! నగరంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. రోడ్లమీద భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని సష్దర్‌గంజ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2.30 నుంచి 5.30 గంటల వరకు 73.2 సెంటీమీటర్ల వాన నమోదయిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరో రెండు వారాలపాటు ఇదేవిధంగా వానలు కురుస్తాయని వెల్లడించింది. #WATCH | Delhi: Roads waterlogged in Pragati Maidan area as the national capital continues to receive rainfall pic.twitter.com/UY1LsFUt0A — ANI (@ANI) August 21, 2021 -
Cyclone Tauktae: తౌక్టే ఎఫెక్ట్‌తో 21 జిల్లాల్లో అలర్ట్
సాక్షి ముంబై: తౌక్టే తుఫాన్ ఆదివారం వేకుమజామున మహారాష్ట్రలోకి ప్రవేశించనుండటంతో 21 జిల్లాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మరో 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఇక టౌటే తుపాన్ ప్రభావంతో మహారాష్ట్రలోని సింధుదుర్గా, రత్నగిరి జిల్లాల్లో ఇప్పటికే ఈదురు గాలులతోపాటు మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. అనేక తీర ప్రాంతాల్లో సముద్ర అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండగా మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకూలాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా టౌటే తుఫాన్ మహారాష్ట్రలోకి ఆదివారం వేకువజామున ప్రవేశించనుందని అంచనా. అయితే సముద్రతీరానికి సుమారు 350 కిలోమీటర్ల దూరం నుంచి ఈ టౌటే తుఫాన్ గుజరాత్ దిశగా ముందుకుసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ముందుకు సాగుతున్న కొద్దీ బలపడుతోంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడనుంది. ఇలాంటి నేపథ్యంలో అధికారులు అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 16, 17, 18 తేదీల్లో.. ముంబై కొలాబా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో అలర్ట్‌ను జారీ చేశారు. వీటిలో కొంకణ్తోపాటు విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని జిల్లాలున్నాయి. ఆరెంజ్ అలర్ట్ జిల్లాలలో సింధుదుర్గా, రత్నగిరి, సాతారా, సాంగ్లీ, కోల్హపూర్ ఉన్నాయి. మరోవైపు ఎల్లో అలర్ట్ జిల్లాల్లో విదర్భలోని 11 జిల్లాలతోపాటు ముంబై, థానే, పాల్ఘర్, రాయిగడ్, పుణేలున్నాయి. మరోవైపు గతంలో నిసర్గ తుఫాన్ మహారాష్ట్ర భూభాగం నుంచి తీరం చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ తుఫాన్ మహారాష్ట్ర భూభాగం నుంచి తీరంపై విరుచుకుపడనుందా అనే విషయంపై అక్కడి ప్రాంత ప్రజల్లో కొంత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిదేమి లేదని సముద్ర తీరానికి దూరం నుంచే గుజరాత్లో మే 18వ తేదీ తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 16, 17, 18వ తేదీలలో మహారాష్ట్రపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి నేపథ్యంలో కొంకణ్‌లోని సింధుదుర్గా, రత్నగిరి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా రాయిగఢ్, ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సింధుదుర్గా జిల్లాల్లోని 38 గ్రామాలకు తుఫాన్ ముప్పు ఏర్పడింది. దీంతో అక్కడి అధిక ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించం ప్రారంభించారు. సీలింక్‌పై రాకపోకలు బంద్ టౌటే తుఫాన్ ప్రభావం ముంబై, థాణే, పాల్ఘర్లతోపాటు రాయిగఢ్ జిల్లాలపై ప్రభావం కూడా పడే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ముంబైలోని వర్లీ సీలింక్ వంతెనపై నుంచి రాకపోకలను మూసివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ తెలిపారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జంబో కోవిడ్ సెంటర్లలోని రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బీఎంసీలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలపై నిఘా వేయడంతోపాటు సూచనలు, సహాయాన్ని అందించడం జరగనుంది. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, నేవీతోపాటు పోలీసులు, కోస్టుగార్డు ఇతర బలగాలను తీర ప్రాంతాల్లో మొహరించారు. తీర ప్రాంతాలకు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు. దీంతోపాటు వర్షాలు కారణంగా ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలలో టీకాలను వేయడాన్ని ఆదివారం నిలిపివేశారు. -
ముంబైకి భారీ వర్ష సూచన
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ముంబైతో పాటు కొంకణ్ తీరమంతటా వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముంబై, కొంకణ్ తీర ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో శుక్ర, శని వారాల్లో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సిందిగా ముంబై పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవరసర పరిస్థితుల్లో మాత్రమే.. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావొచ్చని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ దాదాపు లక్షా డెబ్బై వేల మంది కోవిడ్ బారిన పడగా.. ఏడు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి.(కరోనా: మహారాష్ట్ర మరో ముందడుగు) -
దక్షిణ కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. భారత వాతావరణ అధ్యయన విభాగం తొలిసారిగా దక్షిణ కర్ణాటక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మొత్తం 30 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో 40 డిగ్రీ సెల్సియస్‌ను మించిన ఉష్ణోగ్రతలున్నాయి. అత్యధికంగా బళ్లారిలో 45.1 డిగ్రీలు నమోదైంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చంటూ బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కొలారు, రామనగర, చిక్కబళాపుర తుమకూరు, మైసూరు, మండ్య, చామరాజనగర, దావణగెరె, చిత్రదుర్గ,శివమొగ్గ, హాసన్, కొడుగుజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.