Flash Flood In Himachal Pradesh Leaves Over 200 Tourists And Locals Stranded - Sakshi
Sakshi News home page

Himachal Pradesh Floods: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం

Published Mon, Jun 26 2023 10:14 AM | Last Updated on Mon, Jun 26 2023 11:17 AM

Flash Flood In Himachal Pradesh Leaves Over 200 Tourists - Sakshi

సిమ్లా: ఉత్తరాదిలో హిమాచల్‌ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా, మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయని దీంతో టూరిస్టులు కూడా వరదల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. 

వివరాల ప్రకారం.. భారీ వర్షాల కారణంగా బాగిపుల్ ప్రాంతంలోని ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు మండి ప్రషార్ రోడ్‌లోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారు. చంబా నుండి వచ్చిన విద్యార్థుల బస్సు పరాశర్ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ సూద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుండి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. పంచకులలో ఓ కారు వరదనీటిలో కొట్టుకుపోగా ఓ మహిళను స్థానికులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చదవండి: పెళ్లింట పెను విషాదం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement