సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.
ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న మూడురోజులు (జులై 25,26,27) రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రోజున హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
(చదవండి: విద్యాసంస్థలకు సెలవులు పొడిగించేనా!)
జులై 25, మంగళవారం
⇒ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం.
⇒ భారీ నుంచి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం.
⇒ భారీ వర్షాలు జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం.
⇒ తెలంగాణ రాష్ట్రంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం.
⇒ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, కర్నాటకలనూ భారీ వర్షాలు కురిసే అవకాశం. రాయలసీమ, కర్నాటకలోనూ భారీ వర్షాలకు అవకాశం.
(చదవండి: Snake On TVS Bike: ద్విచక్రవాహనం ఎక్కిన పాము..)
Comments
Please login to add a commentAdd a comment