సాక్షి, హైదరాబాద్: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం శనివారం బలహీనపడటంతో వానలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ సమీపంలోని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో విస్తారంగా వానలు పడతాయని అంచనా వేసింది.
ఇదే సమయంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు 25, 26 తేదీలకు సంబంధించి రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఇక శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 10 సెంటీమీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.8 సెంటీమీటర్ల సగటు వాన కురిసింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వానలు పడ్డాయి.
ఇది కూడా చదవండి: కడెం.. జనం గుండెల్లో సైరన్!
Comments
Please login to add a commentAdd a comment