సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వద్ద గురువారం అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
చదవండి👉🏻 విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే!
ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశాల్లో వచ్చే మూడురోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మే తొలివారంలో వర్షాలు పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. బొగ్గు నిల్వలు అడుగంటడంతో థర్మల్ విద్యుత్ తయారీ సంకటంలో పడిందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం గమనార్హం. కొరత కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు షురూ అయ్యాయి.
చదవండి👉 క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో
Comments
Please login to add a commentAdd a comment