
దక్షిణ కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్
కర్ణాటకలో భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. భారత వాతావరణ అధ్యయన విభాగం తొలిసారిగా దక్షిణ కర్ణాటక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. భారత వాతావరణ అధ్యయన విభాగం తొలిసారిగా దక్షిణ కర్ణాటక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మొత్తం 30 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో 40 డిగ్రీ సెల్సియస్‌ను మించిన ఉష్ణోగ్రతలున్నాయి. అత్యధికంగా బళ్లారిలో 45.1 డిగ్రీలు నమోదైంది.
సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చంటూ బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కొలారు, రామనగర, చిక్కబళాపుర తుమకూరు, మైసూరు, మండ్య, చామరాజనగర, దావణగెరె, చిత్రదుర్గ,శివమొగ్గ, హాసన్, కొడుగుజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.