విశాఖపట్టణం చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఉదృతమైంది.
విశాఖపట్టణం: విశాఖపట్టణం చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఉదృతమైంది. నవంబర్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో సూర్య కిరణాలు తాకక ముందు బయటకు రావాలంటే ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి లో 5 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.