చైనాలోని యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సిద్ధార్థ్ ఛటర్జీ చేసిన యోగా నెట్టింట సంచలనం రేపుతుంది. మైనస్ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 'ఓం' కార పఠనంతో బ్రీతింగ్ వ్యాయామాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి గల వీడియోని ఛటర్జీ "బ్రీతింగ్ ఫర్ గుడ్ హెల్త్" అనే పేరుతో పోస్ట్ చేశారు. ఆయన ఆ వీడియోలో బీజింగ్‌లోని గడ్డకట్టుకుపోయిన సరస్సుపై కూర్చొని శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేశారు. ఇది శారీరక, మానసికి ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వ్యాయామాలని వీడియో ప్రారంభంలోనే చెప్పారు. పొట్టను లోపలకి, బయటకు వదిలేలా లోతైన శ్వాస వ్యాయామాలు 'ఓం' కార పఠనంతో మొదలవ్వుతుందని అన్నారు.
మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మొదట పని శ్వాస పీల్చుకోవడం. ఇక ఆఖరి పని దాన్ని విడిచిపెట్టయడమే అని చెప్పారు. ఇర ఆయన ఆ ఎముకలు కొరికే చలిలో పొట్టకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్‌సైజుల తోపాటు శీర్షాసనం వంటివి యోగాసనాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా ఈ వ్యాయామాల వల్ల కరోనా వంటి మహమ్మారిల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆయన 2020లొ చైనాలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులైన టైంలో అధిక కొలస్ట్రాల్, బీపీ, అధిక హృదయ స్పందన రేటు, ప్రీ డయాబెటిక్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత ఈ యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు, సరైన జీవన శైలితో అనూహ్యంగా 25 కిలోల బరువు తగ్గడం జరిగింది. ఇక భారత్‌కి చెందిన ఛటర్జీ చైనాలోని యూఎన్ కార్యాలయానకి అధిపతిగా నియమించడం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎందుకంటే తూర్పు లడఖ్ ప్రతిసష్టంభన, భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆయన నియామకం జరగడమే అందుకు కారణం.
కాగా, ఛటర్జీ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వలస వచ్చిన కుటుంబం. చిన్నప్పుడు బాల్యంలో ఆయన పోలియో బాధితుడు. సరైన చికత్స తీసుకుని పోలియో నుంచి పూర్తిగా రికవరయ్యాడు. ఆ తర్వాత 1981లో రెండో ప్రయత్నంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అక్కడ నుంచి ఆయన ప్లేయర్‌గా, బాక్సర్‌గా మారి ఎన్నో టైటిల్స్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలైట్ పారా రెజిమెంటల్‌లో చేరారు. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడ ఐవీ లీగ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆ తర్వాత యూఎన్ మిషన్‌కి నాయకత్వం వహించారు. ఆయన భార్య బాన్ హ్యూన్ హీ భారత్‌లోని యూనిసెఫ్ సామాజిక విధానానికి చీఫ్‌గా ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా తన 24 ఏళ్ల కెరీర్‌లో కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ (డార్ఫర్), ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా చైనా పొరుగు దేశం ఇరాకీ కుర్దిస్తాన్ వంటి దేశాలలో పనిచేశారు. ఛటర్జీ యూఎన్ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), UNICEF, UN పాపులేషన్ ఫండ్ (UNFPA), రెడ్ క్రాస్ ఉద్యమం, UNOPS,UN భద్రతలలో కూడా పనిచేశారు. తన దౌత్యపరమైన పనుల తోపాటు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరిచేలా..ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుని యాక్టివ్‌గా ఉండేలా చేసే శ్వాస వ్యాయమాలను సాధన చేస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు సిద్ధార్థ్ ఛటర్జీ.
VIDEO | Siddharth Chatterjee, the head of the #UN in China, is making waves on Chinese social media where he showcased his tough yoga and fitness exploits, including breathing exercises in sub-zero temperatures, which he says helped him to maintain physical and mental… pic.twitter.com/4q5nifvJHC
— Press Trust of India (@PTI_News) April 16, 2024
(చదవండి: మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?)
Comments
Please login to add a commentAdd a comment