సాక్షి సిటీబ్యూరో: భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు సిటీజనులు వివిధ ఉపశమన మార్గాలను ఎంచుకుంటున్నారు. గతంలో అందరూ ముఖానికి రుమాళ్లు కట్టుకునేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కొంతకాలంగా సమ్మర్ మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. యువతీ యువకులకు వేర్వేరుగా ప్రత్యేకమైన మాస్క్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఎండ నుంచి రక్షణ పొందడానికి వీరు మాస్క్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. ‘ప్రతిఏటా సరికొత్త మాస్క్‌లను తయారు చేయిస్తాం. ఈసారి కూడా ట్రెండ్‌కు అనుగుణంగా విభిన్నంగా ఉత్పత్తులు తయారు చేయించాం. ఇప్పటి వరకు మహిళలు చున్నీతో ముఖాన్ని కవర్ చేసుకునేవారు. అయితే అంతా కంఫర్టబుల్‌గా లేకపోవడంతో.. వారికోసం ప్రత్యేకంగా మాస్క్‌లను తయారు చేయించామ’ని మదీనా సర్కిల్‌లోని మహ్మద్ క్యాప్‌మార్ట్ నిర్వాహకులు ఇల్యాస్ బుఖారీ తెలిపారు. ఈ కొత్త మాస్క్ లైట్‌వెయిట్‌తో పాటు వందశాతం కాటన్‌తో తయారైందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment