సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. చలితీవ్రత పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పొగ మంచు కారణంగా 16 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒకవైపు చలి, మరోవైపు ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇక రహదారులపై కూడా పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్‌లైట్లు వేసుకున్నా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం బయటకు రావాలంటే స్థానికులు జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment