train delays
-
సెంట్రల్ రైల్వే కారిడార్‌లో నిలిచిపోయిన రైళ్లు.. కారణం..
ముంబయి సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్‌లో సోమవారం ఉదయం సిగ్నలింగ్ సమస్యల వల్ల రైలు సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఉదయం 9.16 గంటలకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల థానే రైల్వేస్టేషన్ పరిధిలో సబర్బన్ రైలు సేవలు నిలిచిపోయాయని సెంట్రల్ రైల్వే ప్రతినిధి పేర్కొన్నారు.థానే రైల్వేస్టేషన్ పరిధిలో సిగ్నల్ వైఫల్యం కారణంగా కళ్యాణ్(థానే), కుర్లా (ముంబయి) మధ్య సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాంతో ఇరుప్రాంతాలకు ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఉదయం 10.15 గంటలకు సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్ సబర్బన్ పరిధి దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి కళ్యాణ్ (థానే జిల్లా), ఖోపోలి (రాయ్‌గఢ్) వరకు విస్తరించి ఉంది. ఈ కారిడార్‌లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 20 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఢిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. మంచు కారణంగా 20 వరకు రైళ్లు 1.30 గంటల నుంచి 4.30 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్ విమానాశ్రయాల్లో 200 మీటర్ల దూరం పైబడి ఉన్న వస్తువులు కనిపించలేదని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో 40 రోజులపాటు కొనసాగే తీవ్రమైన శీతాకాల సీజన్ ‘చిల్లా–ఇ–కలాన్’ప్రభావం గురువారం కనిపించింది. లోయలోని చాలా ప్రాంతాల్లో మంచి నీటి పైపులు, దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టుకుపోయాయి. బుధవారం రాత్రి శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత –5.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి –4.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపుల్లో ఒకటైన పహల్గాంలో అత్యల్పంగా –6.8 డిగ్రీలు, గుల్మార్గ్లో –5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదా తేలిక పాటి మంచు కురియవచ్చని ఐఎండీ అంచనా వేసింది. డిసెంబర్ 21న మొదలైన ఈ చిల్లా–ఇ–కలాన్ సీజన్ జనవరి 30వ తేదీ వరకు ఉంటుంది. -
‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్
మీరు ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు చాలా ఓల్డ్ డైలాగ్ కానీ మనం ఎక్కిన రైలు సరైన సమయానికి చేరుకోవడమన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. చాలా సార్లు రైళ్లు ఆలస్యం కావడం వల్ల ముఖ్యమైన పనులు చేయలేకపోతుంటా. సరేలే అని సర్థుకుపోతాం. కానీ ఓ వ్యక్తి అలా ఊరుకోకుండా రైలు ఆలస్యంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫలితం సాధించాడు. అంతులేని ఆలస్యం కశ్మీర్‌కి చెందిన సంజయ్ శుక్లా జమ్ము నుంచి శ్రీనగర్‌కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఈ ఫ్లైట్‌ని అందుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకి జమ్ము ఏయిర్పోర్టు చేరుకోవాలి. కానీ అతను ఎక్కిన రైలు ఉదయం 8 గంటలకు జమ్ము రావాల్సింది. మధ్యాహ్నం 12 గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో సంజయ్ తన ఫ్లైట్‌ని మిస్ అయ్యాడు. దీంతో ప్రత్యేకంగా కారులో ప్రయాణించి శ్రీనగర్ చేరుకున్నాడు. వేళ కాని వేళ చేరుకోవడం వల్ల అక్కడ హోటల్లో బస చేయాల్సి వచ్చింది. ఈ ఘటన 2016లో జరిగింది. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మా బాధ్యత కాదు రైల్వే శాఖ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బటి వాదిస్తూ ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ నంబర్ 26, పార్ట్ 1, వాల్యూమ్ 1 ప్రకారం రైలు ఆలస్యానికి ఎటువంటి పరిహారం అందివ్వాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు విన్నవించారు. సమయానికి వెల కట్టలేం రైల్వే తరఫున సోలిసిటర్ వినిపించిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుడి సమయానికి వెల కట్టలేమని వ్యాఖ్యానించింది, రైళ్ల ఆలస్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. జవాబుదారి తనం ఉండాలని సూచించింది. ఇలా రైళ్లు ఆలస్యంగా నడిపిప్తూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరంటూ హెచ్చరించింది. పరిహారం చెల్లించండి నిర్దేశిత సమయానికి రైలును గమ్యస్థానం చేర్చలేకపోయినందుకు రైల్వేశాఖను మందలించింది. రైలు ఆలస్యం కారణంగా నష్టపోయిన సంజీవ్ శుక్లాకు పరిహారంగా రూ. 30,000లను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. చదవండి: ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? -
ట్రైన్ ఆలస్యం 500 మంది విద్యార్థులు నీట్ పరీక్ష మిస్
-
కప్పేసిన పొగ మంచు.. 16 రైళ్లు ఆలస్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. చలితీవ్రత పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పొగ మంచు కారణంగా 16 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒకవైపు చలి, మరోవైపు ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రహదారులపై కూడా పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్లైట్లు వేసుకున్నా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం బయటకు రావాలంటే స్థానికులు జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రావడం లేదు. -
రైలు లేటైతే ప్రమోషన్‌పై వేటే
న్యూఢిల్లీ: ఇకపై రైళ్లు ఆలస్యమైతే అధికారులను బాధ్యులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు పదోన్నతులు నిలిపేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. నిర్వహణ పనుల వల్ల రైళ్లు ఆలస్యమవుతున్నాయనే కారణానికి చరమగీతం పాడాలని, రైళ్లు ఆలస్యమవకుండా దృష్టి పెట్టి నెలలోపు మార్పు చూపాలని ఆదేశించారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు, జోనల్ జనరల్ మేనేజర్లతో ఇటీవల జరిగిన సమావేశంలో రైళ్ల ఆలస్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైళ్లు ఆలస్యమయ్యాయో.. ఇక అంతే!
రైళ్లు ఆలస్యం అవుతున్నాయంటే పదే పదే ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు సీరియస్ అయ్యారు. రైళ్లన్నీ సకాలంలో తిరిగేలా చూసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒక సీనియర్ అధికారి తప్పనిసరిగా నైట్ షిఫ్టులో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని, తద్వారా రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించాలని జోనల్ స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. జాతీయ రైలు విచారణ వ్యవస్థలో ఉన్న సమయాలకు, భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్లలో ఉన్న సమయాలకు మధ్య ఉన్న తేడాలను కూడా సురేష్ ప్రభు గుర్తించారు. ఈ రెండింటికి, రైళ్లు వాస్తవంగా నడుస్తున్న సమయాలకు కూడా తేడా ఉండటం గమనార్హం. ఈ సమస్యను కూడా తక్షణం పరిష్కరించాలని రైల్వే అధికారులను ఆయన ఆదేశించారు. గత సంవత్సరం ఏప్రిల్ 1-16 తేదీల మధ్య రైళ్లు సకాలంలో నడిచే తీరు 84 శాతం వరకు ఉండగా, ఈ సంవత్సరం అది 79 శాతానికి పడిపోయింది. రైళ్లు ఆలస్యం కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని, దీన్ని వెంటనే అరికట్టాలని గట్టిగా చెప్పారు. చుట్టుపక్కల డివిజన్లకు చెందిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆలస్యాలను నివారించాలన్నారు. -
రద్దీకి తగిన విధంగా నడవని రైళ్లు