సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత పెరిగింది. చతి కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పలుచోట్ల ఆరు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరోవైపు, పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పొగ మంచు కారణంగా దాదాపు 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకునే రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
— RWFC New Delhi (@RWFC_ND) January 10, 2024
ఇక, మరికొన్ని రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. విమాన ప్రయాణాలపై కూడా పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో, విమాన ప్రయాణకులను కూడా అధికారులు ప్రయాణాలపై అలర్ట్ చేస్తున్నారు.
24 trains to #Delhi from various parts of the country are running late due to dense #fog conditions
— Hindustan Times (@htTweets) January 11, 2024
📷: ANI pic.twitter.com/z2ElqcPBo6
Comments
Please login to add a commentAdd a comment