fog effect
-
పొగమంచుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం.. సోషల్ మీడియాలో వాపోతున్న ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఉత్తరాదిని పొగమంచు కమ్ముకుంటోంది. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై పడుతోంది. విజిబిలిటీ తక్కువగా ఉండటానికి తోడు ఇతరత్రా కారణాలతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే రైళ్లపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.రైళ్ల రాకపోకల్లో ఆలస్యంపై ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పలు ఫిర్యాదులు చేస్తున్నారు. రైలు నంబర్ 06071 కొచ్చువేలి నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు 6 గంటల 47 నిమిషాలు ఆలస్యంగా నడిచి, నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 3.27 గంటలకు చేరుకుంది. ఇదే మాదిరిగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. Gede(3.50)-Sealdah (6.25) . Delay by more than 1 hours, I am going to give blood to a patient, in Kolkata, he needs blood before 8 am, I don't know how to reach before 8 am. Why was no notice given in advance of the train delay?? @drmsdah @RailMinIndia @AshwiniVaishnaw sir. pic.twitter.com/B4hSZUEhC3— Suranjan Paul (@suranjanPaul23) November 18, 2024సురంజన్ పాల్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ‘నేను ప్రయాణించాల్సిన రైలు గంటకు మించిన ఆలస్యంతో సడుస్తోంది. నేను కోల్‌కతాలో ఉన్న ఒక రోగికి రక్తం ఇవ్వాల్సివుంది. అతనికి ఉదయం 8 గంటలలోపు రక్తం ఇవ్వాలి. ఈ లోపున నేను అక్కడికి ఎలా చేరుకోవాలో నాకు తెలియడంలేదు. రైలు ఆలస్యం గురించి ముందస్తు నోటీసు ఎందుకు ఇవ్వలేదని’ ప్రశ్నించారు. Train number - 02569. This train is 7 hour late. Passengers are facing problems due to train delay. Children and elderly are very worried. I might miss office tomorrow too. #trainlate @RailMinIndia @AshwiniVaishnaw @PMOIndia— Alok Kumar Thakur (@aalokthakur) November 17, 2024మరొక ప్రయాణికుడు ‘రైలు నంబర్ - 02569.. ఏడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్లలేను. రేపు ఆఫీసుకి తప్పకుండా వెళ్లాలి’ అని రాశాడు. అంజలి ఝా అనే ప్రయాణికురాలు 23:55కి చేరుకోవాల్సిన రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందని, రన్నింగ్ స్టేటస్ కొద్ది నిమిషాల క్రితమే నవీకరించారని తెలిపారు. నాకు 23:44కి ఈ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను అర్ధరాత్రి రెండు గంటల పాటు ఎలా వేచి ఉండాలి’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
గన్నవరం: దట్టమైన పొగ మంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక, దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, గన్నవరంలో ల్యాండ్ అవాల్సిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ మంచు కారణంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానాల్లు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఇక, ఉదయం తొమ్మిది గంటల సమయం దాటిన తర్వాత పొగ మంచు వీడిపోవడంతో 10 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం, ఇండిగో విమానాలు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పొగ మంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న 24 రైళ్లు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత పెరిగింది. చతి కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పలుచోట్ల ఆరు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరోవైపు, పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పొగ మంచు కారణంగా దాదాపు 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకునే రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. pic.twitter.com/88pz5m7ZsG — RWFC New Delhi (@RWFC_ND) January 10, 2024 ఇక, మరికొన్ని రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. విమాన ప్రయాణాలపై కూడా పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో, విమాన ప్రయాణకులను కూడా అధికారులు ప్రయాణాలపై అలర్ట్ చేస్తున్నారు. 24 trains to #Delhi from various parts of the country are running late due to dense #fog conditions 📷: ANI pic.twitter.com/z2ElqcPBo6 — Hindustan Times (@htTweets) January 11, 2024 -
పొగమంచు ఎఫెక్ట్: స్కూల్స్ బంద్, విమానాలు ఆలస్యం
ఢిల్లీ: ఉత్తరాదిన పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా పలు చోట్ల విద్యాసంస్థలను సెలవు కూడా ప్రకటించారు. ఇక, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఐఎండీ అంచనాల ప్రకారం.. మరో రెండు రోజులు కూడా ఈ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాదితోపాటు తూర్పు భారతదేశంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మధ్య భారతంలో చలి తీవ్రత రాబోయే మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. VIDEO | Visibility reduces to near-zero in Uttar Pradesh's Rae Bareli due to dense #fog in the region.#WeatherUpdate pic.twitter.com/BnF3A5HtTL — Press Trust of India (@PTI_News) January 4, 2024 వివరాల ప్రకారం.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, జమ్మూ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం ఏడు గంటలు దాటినా రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు, పొగమంచు ప్రభావం అటు విమానాలు, రైళ్ల రాకపోకలపై కూడా పడుతుండటంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా ప్రయాణించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, దక్షిణ భారతంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శీతల గాలుల కారణంగా చలి తీవ్రత పెరిగింది. VIDEO | Dense fog cover shrouds parts of Rajasthan's capital #Jaipur as severe cold conditions prevail in the region.#WeatherUpdate (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Na1zKoMbVG — Press Trust of India (@PTI_News) January 4, 2024 -
Fog In Tirumala Photos: తిరుమలను చుట్టేసిన పొగమంచు (ఫోటోలు)
-
పొగమంచుతో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
బీజింగ్: చలితీవ్రత పెరగడంతో పొగమంచు కమ్మేస్తోంది. ముందు ఉన్న వారిని సైతం గుర్తుపట్టలేనంతగా దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. పొగమంచు కారణంగా చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామును ఘోర ప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టడంతో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాంచాంగ్ కౌంటీలో జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఘటన జరిగిన ఒక గంట తర్వాత వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నాంచాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేశారు. భారీగా పొగమంచు కమ్మేసిన క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. రోడ్లపై అప్రమత్తతో ఉంటూ డ్రైవర్లు ముందుకు సాగాలని సూచించారు. ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
దోమల కోసం పొగ వేస్తే.. ఊపిరాడక మహిళ మృతి
తిరువొత్తియూరు: చెన్నై పమ్మల్ పొన్నియమ్మన్ వీధికి చెందిన చొక్కలింగం (53) ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగి. అతని భార్య పుష్పలక్ష్మి బుధవారం రాత్రి ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో నిప్పులతో పొగ వేసి, ఏసీ ఆన్ చేసి పడుకున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక పుష్పలక్ష్మి మృతి చెందింది. మిగతా ముగ్గురు ఆస్పత్రిలో పోరాడుతున్నారు. గురువారం ఉదయం చాలాసేపు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి తలుపు తెరచి చూడగా పుష్పలక్ష్మి మృతి చెందగా, మిగతా వారు స్ప్పహ తప్పి ఉన్నారు. వారిలో చొక్కలింగం, కుమార్తె మల్లిక, కుమారుడు విశాల్‌ను చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఢిల్లీని కప్పేసిన పొగమంచు..
-
రాజధానిపై పొగమంచు పంజా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దట్టంగా అలుముకున్న మంచుతో ప్రజలు, వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు చలిగాలులు , మరోవైపు పొగమంచుతో రాజధాని అతలాకుతలమవుతోంది. మంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. వాతావరణంలో మార్పులు కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. సప్దర్జంగ్లో 2.6, పాలంలో 2.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలను అధికారులు దారిమళ్లించారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోనూ పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు కారణంగా గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. దాన్కర్ ప్రాంతంలో మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి కెనాల్లో పడింది. దీంతో కారులో 11 మంది ప్రయాణిస్తుండగా అందులో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో నలుగురు మృతిచెందారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పొగమంచును ముందే పసిగట్టొచ్చు
సాక్షి బెంగళూరు: నగర శివారులోని కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సీజన్లో పొగమంచు కారణంగా 600 వి మానాలకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా వచ్చే సీజన్లలో విమానాల సంచారానికి అంత రాయం కలగకుండా కొత్త టెక్నాలజీని అం దుబాటులోకి తేనున్నారు. ఈమేరకు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్సీఏఎస్ఆర్) గత నలభై నెలలుగా పరిశోధన చేసి కనిపెట్టా రు. ఫలితంగా ఐదు నుంచి ఆరు గంటల ముందుగానే పొగమంచు ప్రభావాన్ని.. తీవ్రతను కనిపెట్టవచ్చు. దీంతో విమానాలను ముందుగానే ఆపవచ్చు. ప్రయాణికు లకు ఇబ్బందిఉండదు. వచ్చిన విమానాలు ఆకాశంలో తిరగాల్సిన పనిలేదు. కాగా జేఎన్సీఏఎస్ఆర్ నివేదికలను బెంగళూరు ఇం టర్ నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (బీఐఏఎల్) పరిశీలించింది. ఈమేరకు ఆరు గం టలు ముందుగానే పొగమంచును ఊహించే సాంకేతికతను కనుగొన్నట్లు జేఎన్సీఏఎస్ఆర్ బృందం లీడర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే 40 నెలల కాలానికి సరిపడే విధంగా తమ బృందం పరిశోధనలు చేసి పొగమంచును అంచనా వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మైక్రో ఫిజిక్స్, రేడియేషన్, రాత్రి ఉష్ణోగ్రతల ఆధారంగా పొగమంచును అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడు చలికాలాల సీజన్లలో రాత్రి ఉష్ణోగ్రతలు తదితర ప్ర మాణాల ఆధారంగా పొగమంచును అంచ నా వేసి విదేశీ ఎయిర్‌పోర్టుల్లోనే మరింత ఆలస్యంగా బయలుదేరేలా సూచించే అవకాశం ఉందన్నారు. పొగమంచు ప్రభావం తగ్గిపోయే సమయం ఆధారంగా విమానాలను ఆహ్వానించవచ్చు. కాగా పొగమంచు నివేదికలు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో వివరిస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున వచ్చే విమానాలకు ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. -
కప్పేసిన పొగ మంచు.. 16 రైళ్లు ఆలస్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. చలితీవ్రత పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పొగ మంచు కారణంగా 16 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒకవైపు చలి, మరోవైపు ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రహదారులపై కూడా పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్లైట్లు వేసుకున్నా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం బయటకు రావాలంటే స్థానికులు జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రావడం లేదు. -
16 వాహనాలు ఢీ
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని హైదరాబాద్–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల డ్రైవర్లకు దారి కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొని అక్కడే ఆగిపోయింది. దాని వెనకాలే వస్తున్న కార్లు, లారీలు, బస్సులు ఒకదానికి మరొకటి వరుసగా 16 వాహనాలు ఢీకొన్నాయి. దీంతో పది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలతో ఒక్కసారిగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో స్థానిక పోలీసులు వాహనాలను పాత జాతీయ రహదారి మీదుగా మళ్లించగా నందిగామ గ్రామంలోంచి పాత జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లడంతో అక్కడా వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్‌జాం అయింది. సుమారు గంట అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయు కాలుష్యంతో ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడితే తాజాగా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో గురువారం రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా గురువారం ఉదయం 7.30 నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు వల్ల 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్, ఫరక్కా ఎక్స్‌ప్రెస్, పూర్వ ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్ ఎక్స్ ప్రెస్ వేస్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులకు అంతరాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు దట్టంగా అలుముకోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఢిల్లీ నుంచి వివిధ గమ్యస్ధానాలకు వెళ్లే విమాన సర్వీసుల డిపార్చర్ నిలిపివేశారు. విమానాలు సురక్షితంగా టేకాఫ్ అయ్యేందుకు 125 మీటర్ల మేర స్పష్టమైన విజిబిలిటటీ అవసరం కాగా, మంచు కారణంగా రెండు గంటలు పైగా విమానాల డిపార్చర్‌ను నిలిపివేశారు. మంగళవారం క్రిస్మస్ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సన్నద్ధం కాగా విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలు ల్యాండ్ అయ్యేందుకు 50 మీటర్ల విజిబిలిటీ అవసరం కావడంతో అరైవల్స్‌కు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇక ఉదయం 7.15 గంటల నుంచి లో విజిబిలిటీ కారణంగా విమానాల టేకాఫ్‌ను నిలిపివేశారు. దాదాపు రెండు గంటల తర్వాత విమానాల డిపార్చర్‌కు అధికారులు అనుమతించారు. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ : చలిగాలుల తీవ్రతతో దేశరాజధాని గజగజ వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో చలిపులి పంజా విసురుతోంది. సోమవారం ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్ సగటుతో పోలిస్తే కనిష్ట ఉష్ణోగ్రత మరింత తక్కువగా 6.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఢిల్లీని ఈ ఉదయం మంచుపొరలు కమ్మేశాయని, అయితే ఆకాశం నిర్మలంగా ఉందని, వర్షం కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు చలిగాలులతో పాటు ఢిల్లీని కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత ప్రమాణాలు ఢిల్లీలో ఇంకా దారుణంగానే ఉన్నాయని వాయు కాలుష్య తీవ్రతను తెలిపే పీఎం 2.5, పీఎం 10 ప్రమాదకరస్ధాయిలోనే ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. -
దలైలామా విమానానికి ల్యాండింగ్ ట్రబుల్
కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దాంతో రన్‌వే మీద విమానాలు దిగేందుకు వీలు లేకుండా పోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ఇలాగే దిగేందుకు అవకాశం లేక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ విమానంలో ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా కూడా ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నరు. ఉదయం 8.55 గంటలకు ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ల్యాండ్ అవ్వడానికి తగిన విజిబులిటీ లేకపోవడంతో అది గాల్లోనే చక్కర్లు కొడుతోంది. విమానం దిగడానికి వాతావరణం అనుకూలంగా లేదని పైలట్ విమానాశ్రయ అధికారులకు చెప్పారు. సూర్యుడి వేడి వచ్చిన తర్వాత గానీ పొగమంచు విడిపోయే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు దలైలామా ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో తరచు ఇదే పరిస్థితి తలెత్తుతోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉదయం పూట వచ్చే విమానాలు ల్యాండింగ్ కావడానికి ఆలస్యం అవుతోంది. గ్రామీణ ప్రాంతం కావడంతో మంచు ఎక్కువగా ఉండటం ఒక కారణం కాగా, రన్‌వే పెద్దది కాకపోవడం కూడా మరో ముఖ్యమైన సమస్య అని చెబుతున్నారు. -
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న మంచు
ఢిల్లీ: దేశ రాజధానిలో పొగమంచు వల్ల జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. దట్టమైన పొగమంచు కప్పుకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ప్రస్తుతం మంచు ఎఫెక్ట్‌తో 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేయగా మరో రెండు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు జమ్ము కాశ్మీర్లో విపరీతమైన మంచు కురుస్తుండటంతో.. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు. పత్నిటాప్లోని జవహర్ టన్నల్ వద్ద మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. రహదారిని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో శ్రీనగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. -
పొగమంచు ఎఫెక్ట్: పలు రైళ్లు, విమానాల ఆలస్యం
ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి రావలసిన, అక్కడి నుంచి వెళ్లవలసిన పలు రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నేటి (శనివారం) ఉదయం పొగమంచు కారణంగా 70 రైళ్లు ఆలస్యం కాగా, 16 రైళ్ల వేళలలో మార్పులు చేశారు. 7 సర్వీసులను రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాలసిన రెండు విదేశీ విమాన సర్వీసులతో పాటు నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. ఓ విమాన సర్వీసులను రద్దు చేశారు. గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా పలు రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నారు.