ఉత్తర భారతాన్ని వణికిస్తున్న మంచు
ఢిల్లీ: దేశ రాజధానిలో పొగమంచు వల్ల జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. దట్టమైన పొగమంచు కప్పుకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ప్రస్తుతం మంచు ఎఫెక్ట్‌తో 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేయగా మరో రెండు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
మరోవైపు జమ్ము కాశ్మీర్‌లో విపరీతమైన మంచు కురుస్తుండటంతో.. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు. పత్నిటాప్‌లోని జవహర్ టన్నల్ వద్ద మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. రహదారిని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో శ్రీనగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.