
పొగమంచు ఎఫెక్ట్: పలు రైళ్లు, విమానాల ఆలస్యం
ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి రావలసిన, అక్కడి నుంచి వెళ్లవలసిన పలు రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నేటి (శనివారం) ఉదయం పొగమంచు కారణంగా 70 రైళ్లు ఆలస్యం కాగా, 16 రైళ్ల వేళలలో మార్పులు చేశారు. 7 సర్వీసులను రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాలసిన రెండు విదేశీ విమాన సర్వీసులతో పాటు నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. ఓ విమాన సర్వీసులను రద్దు చేశారు. గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా పలు రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నారు.