దలైలామా విమానానికి ల్యాండింగ్ ట్రబుల్
దలైలామా విమానానికి ల్యాండింగ్ ట్రబుల్
Published Thu, Feb 9 2017 9:08 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దాంతో రన్‌వే మీద విమానాలు దిగేందుకు వీలు లేకుండా పోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ఇలాగే దిగేందుకు అవకాశం లేక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ విమానంలో ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా కూడా ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నరు. ఉదయం 8.55 గంటలకు ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ల్యాండ్ అవ్వడానికి తగిన విజిబులిటీ లేకపోవడంతో అది గాల్లోనే చక్కర్లు కొడుతోంది.
విమానం దిగడానికి వాతావరణం అనుకూలంగా లేదని పైలట్ విమానాశ్రయ అధికారులకు చెప్పారు. సూర్యుడి వేడి వచ్చిన తర్వాత గానీ పొగమంచు విడిపోయే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు దలైలామా ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో తరచు ఇదే పరిస్థితి తలెత్తుతోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉదయం పూట వచ్చే విమానాలు ల్యాండింగ్ కావడానికి ఆలస్యం అవుతోంది. గ్రామీణ ప్రాంతం కావడంతో మంచు ఎక్కువగా ఉండటం ఒక కారణం కాగా, రన్‌వే పెద్దది కాకపోవడం కూడా మరో ముఖ్యమైన సమస్య అని చెబుతున్నారు.
Advertisement
Advertisement