
సాక్షి, గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం గన్నవరం నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రాలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించగా ఉదయం 9.30 నిమిషాలకు రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం 5 గంటలకు రానుందని వారు తెలిపారు.
తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 10 గంటలకే ముంబయి చేరుకోవాల్సిన తమకు ఇంత అసౌకర్యం కలుగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment