సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక, దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, గన్నవరంలో ల్యాండ్ అవాల్సిన విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల ప్రకారం.. గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ మంచు కారణంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానాల్లు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.
ఇక, ఉదయం తొమ్మిది గంటల సమయం దాటిన తర్వాత పొగ మంచు వీడిపోవడంతో 10 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం, ఇండిగో విమానాలు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment