ఢిల్లీ: ఉత్తరాదిన పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా పలు చోట్ల విద్యాసంస్థలను సెలవు కూడా ప్రకటించారు. ఇక, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక, ఐఎండీ అంచనాల ప్రకారం.. మరో రెండు రోజులు కూడా ఈ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాదితోపాటు తూర్పు భారతదేశంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మధ్య భారతంలో చలి తీవ్రత రాబోయే మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
VIDEO | Visibility reduces to near-zero in Uttar Pradesh's Rae Bareli due to dense #fog in the region.#WeatherUpdate pic.twitter.com/BnF3A5HtTL
— Press Trust of India (@PTI_News) January 4, 2024
వివరాల ప్రకారం.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, జమ్మూ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం ఏడు గంటలు దాటినా రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు, పొగమంచు ప్రభావం అటు విమానాలు, రైళ్ల రాకపోకలపై కూడా పడుతుండటంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా ప్రయాణించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, దక్షిణ భారతంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శీతల గాలుల కారణంగా చలి తీవ్రత పెరిగింది.
VIDEO | Dense fog cover shrouds parts of Rajasthan's capital #Jaipur as severe cold conditions prevail in the region.#WeatherUpdate
— Press Trust of India (@PTI_News) January 4, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Na1zKoMbVG
Comments
Please login to add a commentAdd a comment