trains delay
-
పొగమంచు ఎఫెక్ట్: స్కూల్స్ బంద్, విమానాలు ఆలస్యం
ఢిల్లీ: ఉత్తరాదిన పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా పలు చోట్ల విద్యాసంస్థలను సెలవు కూడా ప్రకటించారు. ఇక, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఐఎండీ అంచనాల ప్రకారం.. మరో రెండు రోజులు కూడా ఈ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాదితోపాటు తూర్పు భారతదేశంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మధ్య భారతంలో చలి తీవ్రత రాబోయే మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. VIDEO | Visibility reduces to near-zero in Uttar Pradesh's Rae Bareli due to dense #fog in the region.#WeatherUpdate pic.twitter.com/BnF3A5HtTL — Press Trust of India (@PTI_News) January 4, 2024 వివరాల ప్రకారం.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, జమ్మూ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం ఏడు గంటలు దాటినా రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు, పొగమంచు ప్రభావం అటు విమానాలు, రైళ్ల రాకపోకలపై కూడా పడుతుండటంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా ప్రయాణించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, దక్షిణ భారతంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శీతల గాలుల కారణంగా చలి తీవ్రత పెరిగింది. VIDEO | Dense fog cover shrouds parts of Rajasthan's capital #Jaipur as severe cold conditions prevail in the region.#WeatherUpdate (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Na1zKoMbVG — Press Trust of India (@PTI_News) January 4, 2024 -
పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్.. పలు రైళ్లు ఆలస్యం
సాక్షి, తిరుపతి: పద్మావతి ఎక్స్‌ప్రెస్ బుధవారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్ ఫారంలో ఎక్స్‌ప్రెస్‌లోని ఒక భోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. సత్వర చర్యలు చేపట్టిన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సిన 12763 నెంబర్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ 19.45 నిమిషాలకు బయలుదేరనుంది. 12793 నెంబర్ తిరుపతి - నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ బయలుదేరే సమయం కూడా అధికారులు రీ షెడ్యూల్ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ 20:00 గంటలకు బయలుదేరనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: వైఎస్సార్సీపీ నేత మృతి..) -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ట్రైన్ ఎక్కిన తరువాత కూడా ఏ సమయానికి గమ్యం చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు సమయపాలనలో నెంబర్ వన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. మరోవైపు సరీ్వసుల సంఖ్యను సైతం భారీగా తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రైళ్ల నిర్వహణ కోసం ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నారు. దీంతో ఈ సరీ్వసుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రతి సర్వీసు ఆలస్యమే... ‘రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎంఎంటీఎస్‌కే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే’ లక్ష్యంతో ప్రారంభించిన ఈ లోకల్ రైళ్ల సేవలు క్రమంగా మసకబారుతున్నాయి. కోవిడ్ ప్రభావంతో కుదేలైన ఎంఎంటీఎస్ వ్యవస్థను పునరుద్ధరించి ఏడాది దాటినా ఇప్పటికీ ఈ రైళ్ల నిర్వహణ పట్టాలెక్కకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రతి సరీ్వసు అరగంట నుంచి గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎంఎంటీఎస్‌ను నమ్ముకొని ప్రయాణం చేశారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాలకు చెందిన వేలాది మంది ఈ సరీ్వసులకు దూరమయ్యారు. కేవలం సమయపాలన లేకపోవడం వల్లనే ఎంఎంటీఎస్‌లో ప్రయాణించలేకపోతున్నట్లు బాలకిషన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు.‘మధ్యాహ్నం 3 గంటలకు ఒక ట్రైన్ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు బయలుదేరితే సాయంత్రం 4.30 వరకు మరో ట్రైన్ అందుబాటులో ఉండదు. పైగా ఏ రైలు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.’ అని శేఖర్ అనే మరో ప్రయాణికుడు తెలిపారు.ఏదో ఒక విధంగా బేగంపేట్ వరకు చేరినా అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రావడానికే అరగంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు గంటలో చేరుకోవలసి ఉండగా ఒక్కోసారి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. భారీగా ట్రిప్పుల రద్దు.. కోవిడ్‌కు ముందుకు ప్రతి రోజు 121 సరీ్వసులు నడిచాయి. ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మధ్య ప్రతి రోజు 1.6 లక్షల మంది ప్రయాణం చేశారు. కోవిడ్ అనంతరం 75 నుంచి 100 సర్వీసులను పునరుద్ధరించారు. కానీ నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఈ రైళ్లపైన ప్రయాణికులు నమ్మకం కోల్పోయారు. దీంతో రైళ్ల సంఖ్య తగ్గింది. శని, ఆదివారాల్లో గంటకు ఒక రైలు కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రతి వారం 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అందుబాటులో ఉండే రైళ్ల సంఖ్య చాలా తక్కువ. సికింద్రాబాద్‌పై ఒత్తిడి.. మరోవైపు ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్ల రాకపోకలతో ఈ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో పండుగ రద్దీ కారణంగా రెండు రోజులుగా ప్లాట్‌ఫామ్‌లపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎంఎంటీఎస్‌లు నిలిపేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. -
మొరాయించిన రైలింజన్
- పలు రైళ్లు ఆలస్యం భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్ మొరాయించడంతో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన రైలు ఆలస్యంగా నడుస్తోంది. అలాగే కాజీపేట నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
బొర్రా మార్గంలో ఆగిన రైళ్లు
విశాఖ: విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని బొర్రా-చిమిడిపల్లి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గురువారం మధ్యాహ్నం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలికి చేరుకుని మరమ్మతులు ప్రారంభించారు. -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలింజన్
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం రాత్రి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై రైలింజన్ నిలిచిపోయింది. దీని కారణంగా తణుకులో విశాఖ ఎక్స్‌ప్రెస్, అత్తిలిలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. నిడదవోలు, తణుకు మీదుగా విజయవాడ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. -
ఆగిపోయిన గూడ్స్ రైలు; పలురైళ్లు ఆలస్యం
మామిళ్లగూడెం : ఖమ్మం జిల్లా పాపటపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఇంజిన్ ఫెయిల్ కావడంతో సోమవారం సాయంత్రం ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వరంగల్ జిల్లా డోర్నకల్ జంక్షన్ నుంచి వేరొక ఇంజిన్‌ను పంపించి గూడ్స్ రైలును తరలించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. గూడ్స్ నిలిచిపోవడం వల్ల దాని వెనుకే నాగర్ కర్నూలు ఎక్స్‌ప్రెస్ ఆగిపోగా, హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ గంటకుపైగా ఖమ్మం రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. ఇంకా పలు రైళ్లు ఆలస్యమైనట్టు తెలుస్తోంది. -
విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు
వరంగల్ : వరంగల్ జిల్లా సమీపంలోని ఎల్గూర్ రంగంపేట వద్ద బుధవారం ఉదయం రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్గూర్ రంగంపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిన విషయం తెలిసిన వెంటనే సమీప రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ సికింద్రాబాద్, పలాస, బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను ఆపేశారు. 2 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కె. సముద్రంలో తమిళనాడు, గుండ్రామడుగులో శాతవాహన , నెక్కొండలో సింహపురి ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లను నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది విద్యుత్ వైర్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. -
నిలిచిపోయిన పలు రైళ్లు
నల్లగొండ(భువనగిరి) : సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో పలు రైళ్లు సోమవారం సాయంత్రం నిలిచిపోయాయి. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న గూడ్స్ రైలు బీబీనగర్-ఘట్కేసర్ల మధ్య ఆగిపోవడంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీబీనగర్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, పగిడిపల్లిలో రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, భువనగిరిలో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. -
రైల్వే ట్రాక్ పేల్చిన మావోయిస్టులు
-
రైల్వే ట్రాక్ పేల్చిన మావోయిస్టులు
విజయనగరం : ఒబామా భారత్ రాకను నిరసిస్తూ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒడిశా రాయగఢ్ సమీపంలోని మునగడ వద్ద శనివారం తెల్లవారుజామున మావోలు రెండు రైల్వే ట్రాక్‌ను పేల్చేశారు. దీంతో రాయ్‌పూర్, సంబల్పూర్ ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ వైపు వచ్చే మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా రిపబ్లిక్ డే రోజు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైల్వేట్రాక్ పేలుడులో సుమారు 60మంది పాల్గొన్నట్లు సమాచారం. కాగా ఈ సంఘటనలో ఓ గ్యాంగ్‌మెన్ గాయపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.