ఖమ్మం జిల్లా పాపటపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఇంజిన్ ఫెయిల్ కావడంతో సోమవారం సాయంత్రం ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మామిళ్లగూడెం : ఖమ్మం జిల్లా పాపటపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఇంజిన్ ఫెయిల్ కావడంతో సోమవారం సాయంత్రం ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వరంగల్ జిల్లా డోర్నకల్ జంక్షన్ నుంచి వేరొక ఇంజిన్‌ను పంపించి గూడ్స్ రైలును తరలించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు.
గూడ్స్ నిలిచిపోవడం వల్ల దాని వెనుకే నాగర్ కర్నూలు ఎక్స్‌ప్రెస్ ఆగిపోగా, హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ గంటకుపైగా ఖమ్మం రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. ఇంకా పలు రైళ్లు ఆలస్యమైనట్టు తెలుస్తోంది.