ఇంజన్ లేకుండా 8 కిలోమీటర్లు వెళ్లిన రైలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. తనక్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉన్న గూడ్స్ రైల్లోకి రాళ్లు లోడ్ చేస్తున్నారు. ఇందుకోసం బోగిల మధ్య ఉండే లాక్‌లను కొద్దిగా లూజ్ చేశారు. లోడింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే గూడ్స్ రైలు బోగిలు ఒక్కసారిగా కదిలి ముందుకు వెళ్లిపోయాయి. దీంతో రైలులో రాళ్లు లోడ్ చేస్తున్న వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పాటు ముందుకు వెళ్లిన బోగీలు పట్టాలపై ఉన్న మేకలను ఢీ కొట్టింది. అంతేకాకుండా ఓ ట్రాక్టర్‌ను కూడా తనతో పాటు లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.