నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం | technical problms in goods train disrupts traffic at nallagonda | Sakshi
Sakshi News home page

నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Sat, Feb 28 2015 9:41 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

technical problms in goods train disrupts traffic at nallagonda

నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఓ గూడ్స్ రైలు నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముత్తిరెడ్డిగూడెం సమీపంలోని శనివారం ఉదయం  గూడ్స్ రైలు సాంకేతిక లోపం కారణంగా పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళ్లే కాకతీయ, పుష్‌పుల్, సంపర్క్, సింహపురి తదితర రైళ్లు నిలిచిపోయాయి.

దీంతో సదరు రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మరో ఇంజిన్‌ను తెప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల పునరుద్దరణకు మరో గంట వరకు సమయం పడుతుందని అధికారులు చెప్పారు.
(భువనగిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement