రైళ్ల రాకపోకలకు అంతరాయం | Technical interruption is the interruption of trains | Sakshi
Sakshi News home page

రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Fri, Aug 4 2017 2:59 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

రైళ్ల రాకపోకలకు అంతరాయం

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఆలేరు/భువనగిరిఅర్బన్‌: గూడ్స్‌ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపంతో గురువారం సికింద్రాబాద్‌– కాజీపేట రైల్వేమార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఉదయం 8.30 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే సాంకేతిక సమస్య తలెత్తి పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇదే సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న గరీభ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్‌ను జమ్మాపురం, వంగపల్లి ట్రాక్‌ వద్ద నిలిపివేశారు.అలాగే కాకతీయ ప్యాసింజర్‌ గంటన్నర, పుష్‌పుల్‌ రైలును గంటపాటు ఆలేరు స్టేషన్‌లో నిలిపివేశారు. గూడ్స్‌ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగాయని రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement