ఈ ఎలక్ట్రికల్ కారు చూస్తే చిన్నగా, పనితీరు మిన్నగా ఉంది. అందులో ప్రయాణం ‘కారు’చౌక. ఖర్చు తక్కువ, మైలేజీ ఎక్కువ. ఈ కారును ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్ రాకేశ్ తయారుచేశాడు. ఒక్కసారి చార్జ్ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్ అవసరమవుతుందని, పది యూనిట్లు వినియోగమైనా రూ.30 వరకు ఖర్చు అవుతుందని రాకేశ్ వెల్లడించారు.
ఒకసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చని, కారు నడుస్తుంటే కూడా చార్జింగ్ అవుతుందని వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌కు కారును తీసుకురాగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు ఆసక్తిగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment