విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు | trains delay due to Technical problem | Sakshi
Sakshi News home page

విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు

Published Wed, Apr 15 2015 9:45 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM

విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు - Sakshi

విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు

వరంగల్ : వరంగల్ జిల్లా సమీపంలోని ఎల్గూర్ రంగంపేట వద్ద బుధవారం ఉదయం రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్గూర్ రంగంపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిన విషయం తెలిసిన వెంటనే సమీప రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ సికింద్రాబాద్, పలాస,  బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను ఆపేశారు. 2 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కె. సముద్రంలో తమిళనాడు, గుండ్రామడుగులో శాతవాహన , నెక్కొండలో సింహపురి ఎక్స్ప్రెస్, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లను నిలిచిపోయాయి.  రైల్వే సిబ్బంది విద్యుత్ వైర్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement