ఒబామా భారత్ రాకను నిరసిస్తూ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒడిశా రాయగఢ్ సమీపంలోని మునగడ వద్ద శనివారం
విజయనగరం : ఒబామా భారత్ రాకను నిరసిస్తూ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒడిశా రాయగఢ్ సమీపంలోని మునగడ వద్ద శనివారం తెల్లవారుజామున మావోలు రెండు రైల్వే ట్రాక్ను పేల్చేశారు. దీంతో రాయ్పూర్, సంబల్పూర్ ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ వైపు వచ్చే మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా రిపబ్లిక్ డే రోజు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రైల్వేట్రాక్ పేలుడులో సుమారు 60మంది పాల్గొన్నట్లు సమాచారం. కాగా ఈ సంఘటనలో ఓ గ్యాంగ్మెన్ గాయపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.