65 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం | Dense Fog in Delhi, 30 Flights and 65 Trains Delayed | Sakshi
Sakshi News home page

65 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం

Published Wed, Dec 24 2014 12:24 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

65 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం - Sakshi

65 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ: పొగమంచు దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో కాంతి మందగించి రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. 65 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నాలుగు రైళ్లు రద్దయ్యాయి. ఢిల్లీ రావాల్సిన 57 రైళ్లు ఆలస్యంగా రానున్నాయి. పొగమంచు కారణంగా 30 విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.

విజిబిలిటీ 150 మీటర్లకు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం 8.30 గంటలకు తేమ 97 శాతం ఉందని వెల్లడించింది. ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 16.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement