సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు దట్టంగా అలుముకోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఢిల్లీ నుంచి వివిధ గమ్యస్ధానాలకు వెళ్లే విమాన సర్వీసుల డిపార్చర్ నిలిపివేశారు. విమానాలు సురక్షితంగా టేకాఫ్ అయ్యేందుకు 125 మీటర్ల మేర స్పష్టమైన విజిబిలిటటీ అవసరం కాగా, మంచు కారణంగా రెండు గంటలు పైగా విమానాల డిపార్చర్‌ను నిలిపివేశారు. మంగళవారం క్రిస్‌మస్ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సన్నద్ధం కాగా విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
మరోవైపు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలు ల్యాండ్ అయ్యేందుకు 50 మీటర్ల విజిబిలిటీ అవసరం కావడంతో అరైవల్స్‌కు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇక ఉదయం 7.15 గంటల నుంచి లో విజిబిలిటీ కారణంగా విమానాల టేకాఫ్‌ను నిలిపివేశారు. దాదాపు రెండు గంటల తర్వాత విమానాల డిపార్చర్‌కు అధికారులు అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment