సాక్షి, న్యూఢిల్లీ : చలిగాలుల తీవ్రతతో దేశరాజధాని గజగజ వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో చలిపులి పంజా విసురుతోంది. సోమవారం ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్ సగటుతో పోలిస్తే కనిష్ట ఉష్ణోగ్రత మరింత తక్కువగా 6.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
ఢిల్లీని ఈ ఉదయం మంచుపొరలు కమ్మేశాయని, అయితే ఆకాశం నిర్మలంగా ఉందని, వర్షం కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు చలిగాలులతో పాటు ఢిల్లీని కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత ప్రమాణాలు ఢిల్లీలో ఇంకా దారుణంగానే ఉన్నాయని వాయు కాలుష్య తీవ్రతను తెలిపే పీఎం 2.5, పీఎం 10 ప్రమాదకరస్ధాయిలోనే ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment