
విశాఖ జిల్లా లంబసింగిలో దట్టంగా కురుస్తున్న పొగమంచు
చింతపల్లి : విశాఖ ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. మంగళవారం లంబసింగిలో 9 డిగ్రీలు, చింతపల్లిలో 12 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లిలో గత నెల 29న 14 డిగ్రీలు, 31న 13 డిగ్రీలు నమోదయ్యాయి. ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది.
లంబసింగిలో ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. సాయంత్రం 4 గంటలకే చీకటి అలముకుంటోంది. గిరిజనులు చలిమంటలు, నెగడులను ఆశ్రయిస్తున్నారు. ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మంచులో తడిసి ముద్దవుతున్నారు.