తమిళనాడులోని కొన్ని జిల్లాలు, పర్వత ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరడానికి చేరువలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన హిల్ స్టేషన్ ఊటీలో 2.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా , నీలగిరిలోని శాండినాళ్ల రిజర్వాయర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. ఫలితంగా ఉదయం భారీ మంచు కప్పేయడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఊటీ, నీలగిరి కొండ ప్రాంత వాసులు విపరీతమైన చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచుతో స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు.
మరోవైపు పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని ఈ ప్రాంతం మరికొన్ని రోజుల్లో గట్టకట్టుకు పోతుందంటూ హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని నీలగిరి ఎన్వైర్ మెంట్ సోషల్ ట్రస్ట్ (NEST)కి చెందిన వి శివదాస్ చెబుతున్నారు.చలి తీవ్రత ముదురుతోందని ఇలాంటి వాతావరణ మార్పు నీలగిరికి పెద్ద సవాల్ అని, దీనిపై అధ్యయనం జరగాలని అన్నారు.అంతేకాదు ఈ వాతావరణ పరిస్థితి పెద్ద ఎత్తున చేపట్టిన టీ ప్లాంటేషన్‌కు కూడా సవాల్‌గా మారింది.
అధికారిక సమాచారం ప్రకారం, ఉదగమండలంలోని కాంతల్, తలైకుంటలో ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, బొటానికల్ గార్డెన్‌లో 2 డిగ్రీల సెల్సియస్ , శాండినాళ్లలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చాలా చోట్ల, ప్రజలు చలి మంటలు వేసుకుంటూ వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాబోయే నెలల్లో వ్యవసాయం ఇతర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని భయాందోళన వ్యక్తం చేశారు స్థానిక రైతులు. ముఖ్యంగా క్యాబేజీలపై వాతావరణం ప్రభావం చూపిందని కూరగాయల రైతులంటున్నారు. అటు చలిగాలుల కారణంగా పని నిమిత్తం త్వరగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగి ఎన్ రవిచంద్రన్ తెలిపారు.
దట్టమైన పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు పర్యాటకులను అబ్బుర పరుస్తున్నప్పటికీ గతకొన్ని రోజులుగా పాటు, విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్వాసలో ఇబ్బందులు, తీవ్రమైన తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో అక్కడి జనం అల్లాడిపోతున్నారు.
#WATCH | Tamil Nadu: Temperature dips to 0°C in the Sandynalla reservoir area in Tamil Nadu's Nilgiris. Hill station Ooty recorded 2.3°C resulting in heavy frost in the morning. pic.twitter.com/MBqR7c6B9z
— ANI (@ANI) January 18, 2024
Comments
Please login to add a commentAdd a comment