ooty
-
ఊటీలో ఘోర ప్రమాదం
చెన్నై: తమిళనాడు పర్యాటక ప్రాంతం ఊటీలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. #WATCH | Six construction workers died on the spot while undergoing house construction work at Lovedale, near Ooty in Tamil Nadu "Two workers with serious injuries taken to Ooty Government Hospital, one worker missing under the debris, rescue operations underway, say Police. pic.twitter.com/NkrUFxw0TU — ANI (@ANI) February 7, 2024 -
గడ్డ కడుతున్న హిల్ స్టేషన్స్, వణుకుతున్న జనం: నిపుణుల ఆందోళన
తమిళనాడులోని కొన్ని జిల్లాలు, పర్వత ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరడానికి చేరువలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన హిల్ స్టేషన్ ఊటీలో 2.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా , నీలగిరిలోని శాండినాళ్ల రిజర్వాయర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. ఫలితంగా ఉదయం భారీ మంచు కప్పేయడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఊటీ, నీలగిరి కొండ ప్రాంత వాసులు విపరీతమైన చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచుతో స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మరోవైపు పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని ఈ ప్రాంతం మరికొన్ని రోజుల్లో గట్టకట్టుకు పోతుందంటూ హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని నీలగిరి ఎన్వైర్ మెంట్ సోషల్ ట్రస్ట్ (NEST)కి చెందిన వి శివదాస్ చెబుతున్నారు.చలి తీవ్రత ముదురుతోందని ఇలాంటి వాతావరణ మార్పు నీలగిరికి పెద్ద సవాల్ అని, దీనిపై అధ్యయనం జరగాలని అన్నారు.అంతేకాదు ఈ వాతావరణ పరిస్థితి పెద్ద ఎత్తున చేపట్టిన టీ ప్లాంటేషన్‌కు కూడా సవాల్‌గా మారింది. అధికారిక సమాచారం ప్రకారం, ఉదగమండలంలోని కాంతల్, తలైకుంటలో ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, బొటానికల్ గార్డెన్లో 2 డిగ్రీల సెల్సియస్ , శాండినాళ్లలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చాలా చోట్ల, ప్రజలు చలి మంటలు వేసుకుంటూ వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాబోయే నెలల్లో వ్యవసాయం ఇతర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని భయాందోళన వ్యక్తం చేశారు స్థానిక రైతులు. ముఖ్యంగా క్యాబేజీలపై వాతావరణం ప్రభావం చూపిందని కూరగాయల రైతులంటున్నారు. అటు చలిగాలుల కారణంగా పని నిమిత్తం త్వరగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగి ఎన్ రవిచంద్రన్ తెలిపారు. దట్టమైన పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు పర్యాటకులను అబ్బుర పరుస్తున్నప్పటికీ గతకొన్ని రోజులుగా పాటు, విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్వాసలో ఇబ్బందులు, తీవ్రమైన తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. #WATCH | Tamil Nadu: Temperature dips to 0°C in the Sandynalla reservoir area in Tamil Nadu's Nilgiris. Hill station Ooty recorded 2.3°C resulting in heavy frost in the morning. pic.twitter.com/MBqR7c6B9z — ANI (@ANI) January 18, 2024 -
Satya Sri: ఊటీలో చిల్ అవుతున్న జబర్దస్త్ బ్యూటీ (ఫోటోలు)
-
పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్
సాక్షి, చైన్నె: నీలగిరి కొండల్లో ప్రయాణించే ఊటీ టాయ్ ట్రైన్ గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. రెండు బోగీలు ట్రాక్ నుంచి బయటకు వచ్చేశాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికులను కొండ మార్గం గుండా ప్రత్యేక బస్సుల్లో మేట్టుపాళయానికి తరలించారు. నీలగిరి జిల్లాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊటి. ఇక్కడకు రోడ్డు మార్గంలో కన్నా, రైలు మార్గంలో పయనం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బ్రిటీషు హయాంలో మేట్టు పాళయం నుంచి కున్నూరు వరకు తొలుత ఈ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. తదుపరి దశల వారీగా విస్తరించి చివరకు ఊటీ వరకు ఈ రైలు సేవలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కొండలు, లోయల మధ్య సాగే ఈ ప్రయాణంలో 208 మలుపులు, 250 వంతెనలు, 16 సొరంగ మార్గాలు, 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణం నిమిత్తం ముందుగా రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం ఓ రైలు మేట్టు పాళయం నుంచి ఊటీకి బయలు దేరుతుంది. మరో రైలు ఊటీ నుంచి మేట్టుపాళయంకు బయలు దేరుతుంది. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం కున్నూరు రైల్వే స్టేషన్‌ను దాటి వంద మీటర్లు పయనించిన ఈ రైలు హఠాత్తుగా పట్టాలు తప్పింది. వెనుక ఉన్న రెండు బోగీలు పూర్తిగా ట్రాక్ నుంచి కిందకు వచ్చేశాయి. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అందులోని ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రయాణికులను కొండ మార్గంలో ప్రత్యేక బస్సులను రప్పించి మేట్టుపాళయంకు తరలించారు. వర్షం పడుతుండడం వల్లే రైలు బోగీలు జారి ట్రాక్ నుంచి బయటకు వచ్చి ఉంటాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ సకాలంలో రైలును ఆపి వేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కాస్త ముందుకు వెళ్లి ఉంటే బోగీలు లోయలో పడి పెను ప్రమాదం సంభవించేదని భావిస్తున్నారు. -
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్‌లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్‌గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్‌కుడు, కెట్టి, లవ్‌డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
అప్పటికే ఇద్దరితో ఎఫైర్.. పెళ్లైన తర్వాత నాలుగో ప్రియుడి కోసం..
సాక్షి, చెన్నై: కొన్నేళ్ల క్రితం వారికి వివాహమైంది. పెళ్లి బంధంతో ఎంతో హ్యాపీగా ఉన్నారు. వారికి ఇద్దరు సంతానం కూడా ఉండగా.. కుటుంబ కలహాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. తమకు పుట్టిన ఇద్దరు పిల్లలను పంచుకున్నారు. తల్లి వద్ద ఒకరు, తండ్రి వద్ద మరొకరు ఉండగా.. ఆమె వద్ద ఉన్న కొడుకు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. పోస్టుమార్టం చేసిన వైద్యులకు కూడా ఎలా చనిపోయాడో అంతు చిక్కలేదు. తీరా పోలీసుల ఎంట్రీతో ఆమె అసలు రంగు బయటపడింది. నాలుగో బాయ్ ఫ్రెండ్‌తో జల్సాల కోసం కన్నింగ్ ప్లాన్‌తో కన్నకొడుకునే హతమార్చింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఊటీలోని వాషర్ మెన్ పేట్‌కు చెందిన కార్తీక్ (40), గీత (38)ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం కావాడంతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసినా కాపురం నిలబడకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో కొడుకులు నితీశ్, నితిన్‌లను పంచుకున్నారు. ఒక కొడుకు తల్లి దగ్గర, ఇంకో కొడుకు తండ్రి దగ్గర ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఓరోజు తల్లి దగ్గర ఉన్న నితిన్ ఆందోళనతో ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లింది. తన కొడుకు ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడని ఆమె వైద్యుల వద్ద కన్నీరుపెట్టుకుంది. ఈ క్రమంలో అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కాగా, పోస్టుమార్టం నివేదికలో బాలుడు ఎలా చనిపోయాడో వైద్యులు తెలుసుకోలేకపోయారు. దీంతో, బాలుడి మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గీతకు అప్పటికే నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసులు గుర్తించారు. కార్తీక్‌తో పెళ్లికి ముందే మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకుని విడాకులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. నాలుగో బాయ్ ఫ్రెండ్‌తో జల్సాల కోసమే విడాకులు తీసుకున్నట్టు పేర్కొన్నారు. తమ జల్సాల అడ్డుగా ఉన్నాడనే గీత తన బిడ్డకు.. మద్యం తాగించి, ఎక్కువ భోజనం పెట్టి, పదే పదే పాలు తాగించి హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. -
మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ఊటీలో మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు. మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసును డిప్యూటీ తహసీల్దారు లైంగిక వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలో ని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్టు చేశారు. చదవండిః ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు -
అభయారణ్యంలో మినీ ఊటి..!
కొత్తగూడెం అర్బన్: ఏజెన్సీ జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెంలోని అభయారణ్యంలో మినీ ఊటిని తలపిస్తున్న కిన్నెరసానీ ప్రాజెక్టు పర్యటక ప్రాంతం జిల్లాకే మంచి గుర్తింపును ఇస్తుంది. అక్కడ అభయారణ్యంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చటి చెట్లు, చెట్లలో వంద రకాల పక్షులు, జంతువులు, పులులు, చిరుతలు, అడవిదున్నలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, నక్కలు, కణుజులు, కోతులు, కొండముచ్చులున్నాయి. వన్యప్రాణులు, జంతువులు జీవ వైవిద్యానికి నిలయం కిన్నెరసానీ ప్రాజెక్టు. జింకల పార్కు 14.50 హెక్టార్ల విస్తీరణంలో ఉండగా, అభయారణ్యం 634.4 చ.కి.మీ విస్తీరణంలో ఉంది. జింకల పార్కు వద్ద పర్యాటకుల సందడి అయితే 1963–64 సంవత్సరంలో నిర్మాణం అయిన కిన్నెరసానీ ప్రాజెక్టు నుంచి నీరు పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలు తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా 10 వేల ఎకరాల పంటల పొలాలకు నీరును ఎడమ, కుడి కాల్వల ద్వారా అందిస్తుంది. అయితే ప్రాజెక్టు వద్ద 1972 సంవత్సరంలో అభయారణ్యం ప్రాంతంను పర్యటక ప్రాంతంగా టూరిజం వారు గుర్తించి అభివృద్ధి చేశారు. 1974 సంవత్సరంలో ఇక్కడ జింకల పార్కును ఏర్పాటు చేశారు. తొలుత 3 జింకలతో ఏర్పాడిన పార్కు, ప్రస్తుతం 132 జింకలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇందులో కృష్ణ జింకలు, చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు అయితే తొలుత సింగరేణి ఆదీనంలో ఉన్న ఈ పర్యటక ప్రాంతం 2000 సంవత్సరం తరువాత వైల్డ్‌లైప్ వారి అప్పగించారు. అయితే ఇక్కడ ఉన్న అద్దాల మెడ ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అయితే 1999 సంవత్సరంలో ఫిపుల్స్ వారు దీనిని పేల్చివేశారు. అయితే ప్రస్తుతం అద్దాల మెడా, కాటేజ్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయితే మరింతా మంది సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు, జింకల పార్కు, బొటింగ్ కోసం వారానికి పది వేల మంది వరకు సందర్శకులు అంతర్ రాష్ట్రల నుంచి వస్తున్నారు. జింకల పార్కు దృశ్యం అద్దాల మెడ, కాటేజ్‌లు పూర్తి అయితే సందర్శకులు, పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కెటీపిఎస్ అధికారులు రిజర్వాయర్ ప్రారంభంలో జలదృశ్యం(విశ్రాంతి గది) ఏర్పాటు చేశారు. అది మాత్రం మనుగడలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రలలలో మొసళ్లు మోరె జాతి (నల్లవి) వేల సంఖ్యలో కిన్నెరసానీ ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో పాటుగా కిన్నెరసానీలో బోటింగ్ ప్రతి రోజు ఉంటుంది. ప్రాజెక్టు చూడడానికి వచ్చిన ప్రతి వారు బోటింగ్ చేయకుండా వెళ్లారు. -
ఆంధ్రా ఊటీకి అద్దాల బోగీలు
అరకు లోయ: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయకు వచ్చే పర్యాటకుల కోసం రైల్వేశాఖ మరో రెండు అద్దాల బోగీలను అందుబాటులోకి తెస్తోంది. విశాఖ నుంచి అరకు లోయకు నడిచే రెగ్యులర్ ట్రైన్‌కు వీటిని జత చేసేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక అద్దాల రైలు బోగీ ఉన్నప్పటికీ పర్యాటకుల నుంచి ఈ సీజన్లో డిమాండ్ పెరిగింది. దీంతో అరకు ట్రైన్‌కు అదనంగా రెండు విస్టోడోమ్ అద్దాల బోగీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాదే అదనంగా రెండు అద్దాల బోగీలు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినప్పటికీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీలను మంగళవారం రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. విశాఖ నుంచి అరకు లోయ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ రెండు అద్దాల బోగీలు పర్యాటకులు, స్థానికులను ఆకర్షించాయి. వీటిలో రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా, ఇతర అధికారులు ప్రయాణించారు. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీల్లో 44 సీట్లతో పాటు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న విస్టో డోమ్ బోగీ కన్నా ఈ రెండు బోగీల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. -
గాడ్ ఫాదర్: రంగంలోకి దిగిన చిరంజీవి
Chiranjeevi Resumes Godfather Shoot In Ooty: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఊటీలో ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. గాడ్ ఫాదర్: ఊటీలో షూటింగ్ చదవండి : 'మా' ఎన్నికలు : ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు 'లైగర్' టీంకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య -
ఆ అందాలు ఆస్వాదించాలంటే ఊటీ వెళ్లాల్సిందే!
చెవుల మీదకు వేళ్లాడే జడలు, హాఫ్‌వైట్ లుంగీ, ఎరుపు–నలుపు కలగలిసిన చక్కటి నేత ఓణీ. సంప్రదాయ చేనేత ఓణీలోని నేత సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ వస్త్రధారణ. సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ చేత్తో చిటికెలు వేస్తూ ఉత్సాహభరితంగా సాగే ఈ డాన్స్ పేరు టోడా ట్రైబల్ డాన్స్. టోడా ఆదివాసీల సంప్రదాయ నృత్యం. ఈ డాన్సుతోపాటు నీలగిరుల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఊటీబాట పట్టాల్సిందే. ఈ నృత్యం చేస్తున్న వాళ్లు టోడా ఆదివాసీ మహిళలు. ఆదిమ కాలం నుంచి నీలగిరుల్లో నివాసం ఉన్నది వీళ్లే. ఊటీ ట్రిప్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. టీ తోటల మధ్య మలుపులు తిరుగుతూ సాగే రోడ్డు ప్రయాణమే గొప్ప ఆనందం. ఇక్కడ పర్యటించేటప్పుడు కారు అద్దాలను దించుకుని, మాస్కు తీసిసి హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఊటీ టూర్లో ఎత్తైన పీక్ దొడబెట్ట, బొటానికల్ గార్డెన్, టీ గార్డెన్ల విహారం ఎప్పుడూ ఉండేవే. ఈ సారి వాటన్నింటితోపాటు టోడా ట్రైబల్ విలేజ్, రోజ్ గార్డెన్, కూనూర్తోపాటు దేశంలోని వివిధ నిర్మాణశైలులను ప్రతిబింబించే ప్యాలెస్‌ల మీద కూడా ఓ లుక్కేయండి. చాలా చూడాలి! నీలగిరులు ఊటీగా మార్పు చెందే క్రమంలో వెలసిన నిర్మాణాలివి. మైసూర్ మహారాజు నిర్మించుకున్న ఫెర్న్ హిల్ ప్యాలెస్ జోద్పూర్ మహారాజు ఆరన్మోర్ ప్యాలెస్ జామ్‌నగర్ నవాబు నవానగర్ ప్యాలెస్ ఇందోర్, పోర్బందర్, కొచ్చిన్, ట్రావెన్కోర్ రాజవంశీకులు నిర్మించుకున్న వేసవి విడిదులు, వెస్ట్రన్ స్టైల్ చర్చ్‌లు కూడా ఉన్నాయిక్కడ. బస: ఊటీలో మంచి హోటళ్లున్నాయి. ఉత్తరాది, దక్షిణాది, కాంటినెంటల్ రుచులు కూడా దొరుకుతాయి. ఈ టూర్లో ఊటీ స్పెషల్ టీ తాగడం మర్చిపోకూడదు. ఆవిరి బండి ప్రయాణం ఊటీ టూర్ అనగానే మొదటగా టాయ్‌ట్రైన్ గుర్తుకు వస్తుంది. ఆవిరితో నడిచే ఈ రైలు ప్రయాణాన్ని కూనూర్ వరకు కొనసాగించవచ్చు. మనకు ఎనభైల నాటి సినిమాల్లో ఊటీ లొకేషన్లుగా కనిపించే అనేక ప్రాంతాలు కూనూర్లోనివే. తెలుగు సినిమాలో కాదు. బాలీవుడ్ సినిమాలకు కూడా ఇది మంచి లొకేషనే. - వాకా మంజులారెడ్డి చదవండి: Bibi Ka Maqbara: ‘దక్కన్ తాజ్’ ఎవరు కట్టించారో తెలుసా?! -
సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ
సాక్షి, చెన్నై: నీలగిరుల్లో వరుణుడు ప్రళయ తాండవం చేశాడు. జనావాస ప్రాంతాల్లో కాకుండా అడవుల్లో భారీ వర్షం పడింది. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఊటీ సముద్రాన్ని తలపిస్తుంది. నీలగిరులు వరదలతో అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలతో నీలగిరి కొండల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండల నడుమ ఉండే ఊటీ పట్టణంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో పట్టణంలోని అన్ని వీధులు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఊటీ నడిబొడ్టున ఉండే లేక్ లోకి వరదనీరు పోటెత్తటంతో బస్టాండు, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు వాగుల్లా దర్శనిమిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాని పరిస్థితి. కొన్ని కాలనీలు నీట మునగటంతో ప్రభుత్వ సిబ్బంది వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నీలగిరి జిల్లాలోని ఊటీ, కూనూరు, కొత్తగిరి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఊటీ వచ్చే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా మేట్టుపాలయం ఊటీ మార్గాలలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటం ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు నిత్యావసర వస్తువులను మాత్రం భద్రతతో అనుమతిస్తున్నారు. ఇక కోయంబత్తూరులో ఇద్దరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. -
నీలగిరి కొండల్లో ఘోర ప్రమాదం
-
విహారంలో విషాదం..!
ఊటీ అందాలను తిలకించేందుకు వెళ్లిన మిత్ర బృందం అదృశ్యం అయ్యింది. రెండు రోజులుగా రిసార్ట్‌కు ఆ బృందం తిరిగి రాకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు ముమ్మరం చేయడంతో ఓ లోయలో ఆ బృందం వెళ్లిన కారును గుర్తించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఐదుగురు మరణించగా, కొన ఊపిరితో ఉన్న ఇద్దర్ని రెస్క్యూ టీం రక్షించింది. సాక్షి, చెన్నై : చెన్నైకి చెందిన మిత్ర బృందం రామరాజేష్, రవివర్మ, ఇబ్రహీం, జయకుమార్, అరుణ్, అమర్నాథ్, జూడో గత నెల 30న చెన్నై నుంచి ఓ కారులో ఊటీకి వెళ్లారు. అక్కడి ఓ రిసార్ట్‌ను అద్దెకు తీసుకున్నారు. తొలిరోజు ఊటీలో ఉన్న ఈ మిత్రులు, ఒకటో తేదీన ముదుమలై శరణాలయం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఎంతకు తిరిగి రాలేదు. రెండు రోజలైనా ఆ ఏడుగురు తిరిగిరాక పోవడం, రిసార్ట్ సిబ్బందిలో అనుమానాలు నెలకొన్నాయి. వెళ్లిన వారు అదృశ్యం కావడంతో, వారు ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్‌చేశారు. అవన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆందోళన బయలుదేరింది. బుధవారం మధ్యాహ్నం ఊటీ పోలీసులకు విషయాన్ని అందించారు. లోయలో కారు రిసార్ట్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఊటీ నుంచి ముదుమలై వైపు మార్గంలో పరిశీలన చేపట్టారు. కళ్లట్టిమలుపు 35వ క్రాస్ వద్ద ఆగిన ఆ ప్రత్యేక బృందం అక్కడి లోయ మీద దృష్టి పెట్టింది. లోయలో చెట్ల మధ్యలో కారు పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఆందోళన బయలుదేరింది. ఆ పరిసరాలు పొదళ్లతో నిండి ఉండడంతో లోయలో దిగడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద ఒకరిద్దరు లోయలోకి దిగారు. అయినా, కారును సమీపించలేని పరిస్థితి. దీంతో రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. ఈ బృందం అతి కష్టం మీద కారును సమీపించింది. ఐదుగురు బలి ఐదుగురు విగత జీవులయ్యారు. ఇద్దరు కొన ఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. ఓ వైపు చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆగమేఘాలపై లైటింగ్ ఏర్పాట్లు చేసి లోయలో ఉన్న కారులో కొన ఊపిరితో ఉన్న ఇద్దరినీ రక్షించారు. అతి కష్టం మీద వారిని పైకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతుండడంతో గాయాలతో ఉన్న ఆ ఇద్దరు ఏ మేరకు నరకాన్ని అనుభవించి ఉంటారో వర్ణణాతీతం. పొదలతో కూడిన లోయ కావడంతో ఎవరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి. ఈ సమాచారం చెన్నైలోని ఆ ఏడుగురి కుటుంబాల్ని ఆందోళనలో పడేసింది. ఊటీకి పరుగులు తీశారు. కాగా, ముదుమలై శరణాలయానికి వెళ్లే మార్గంలో వాహనం అదుపు తప్పి లోయలో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లోయలోకి కారు దూసుకెళ్లిన సమయంలో పిట్ట గోడల వద్ద ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. దీంతో పోలీసులు ఆదిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతి చెందిన ఐదుగురిలో రవి వర్మ, అమరనాథ్, జూడో, జయకుమార్, ఇబ్రహీం ఉన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామరాజేష్, అరుణ్‌లకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరు స్పృహలోకి వస్తేనే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో తేలనుంది. విహార యాత్రలో పాల్గొన్న వారి ఫోటో (మూలం: సోషల్ మీడియా) -
ప్రేమ ఎలా పుట్టింది?
హర్షకుమార్, తులిక సింగ్ జంటగా దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాస్ట్ సీన్’. మధునారాయణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ, ఏజీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌లో రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టి వాలీ, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ– ‘‘సీటీ లైఫ్ వద్దని స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం కోసం ఊటీలో సెటిల్ అవ్వాలనుకునే అబ్బాయి.. పల్లెటూరు కంటే సిటీ లైఫ్ బాగుంటుంది అని సిటీ అబ్బాయిని లవ్ చేసి అక్కడే సెటిల్ అవ్వాలనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ నిలబడుతుందా? అన్నదే చిత్ర కథ. యూత్‌కి 100% నచ్చే ప్రేమ కథ. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఊటీ షెడ్యూల్‌తో 80% చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన 20% షూటింగ్ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుపుతాం. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్, కెమెరా: జవహర్ రెడ్డి, సహ నిర్మాత: అజయ్ గౌతమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లా జగన్. -
బెయిల్‌పై వచ్చి పెళ్లి చేసుకున్న నటుడి కొడుకు
అర్థాంతరంగా పీటల మీదే ఆగిపోయిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం మంగళవారం ఊటిలో జరిగింది. ఓ యువతిని రేప్ చేసి, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో మహాక్షయ్ను విచారణ చేయడం కోసం పోలీసులు గత శనివారం ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే యువతిని అత్యాచారం చేసిన కేసులో కోర్టు మహాక్షయ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో తన ప్రియురాలు, దక్షిణాది నటి అయిన మదాలస శర్మను ఈ నెల 7న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం మంగళవారం(ఈ రోజు) తమిళనాడు ఊటిలోని తన విలాసవంతమైన హోటల్లో సాంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే మహాక్షయ్, అతని తల్లి యోగిత మీద నమోదైన కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ వీరి విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. -
ఆగిన మిథున్ చక్రవర్తి కొడుకు పెళ్లి
తమిళ సినిమా(చెన్నై): బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం శనివారం అర్థంతరంగా నిలిచిపోయింది. ఓ యువతిని రేప్, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో విచారణ కోసం పోలీసులు ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడని బాధితురాలు ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. తాను గర్భం దాల్చడంతో గర్భస్రావమయ్యేలా ఏవో మందులు ఇచ్చాడని వెల్లడించింది. తన కుమారుడ్ని వదిలేయకుంటే తీవ్ర పర్యావసానాలు ఉంటాయని మహాక్షయ్ తల్లి యోగితా బాలీ తనను బెదిరించినట్లు వాపోయింది. దీంతో ప్రాణాలు రక్షించుకోవడం కోసం ముంబై నుంచి ఢిల్లీకి పారిపోయివచ్చినట్లు పేర్కొంది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోని న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుపై మిథున్ కుటుంబాన్ని విచారించేందుకు పోలీసులు శనివారం తమిళనాడులోని ఊటీలో ఉన్న వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. -
పారిశ్రామికవేత్త అదృశ్యం
చెన్నై: ఊటీలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త భీమరాజు అదృశ్యమయ్యాడు. భీమరాజు ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది. భీమరాజును ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోతగిరి పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఊటీ వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు..
-
అమ్మకు ఓ ముద్దు
అల్లు అర్జున్ ఆదివారమంతా అమ్మాయి అర్హ, అబ్బాయి అయాన్, అర్ధాంగి స్నేహలతో ఆడుతూ పాడుతూ గడిపారట. అదీ హైదరాబాద్‌లో కాదు, ఊటీలో! అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ షూటింగ్ ఊటీలో జరుగుతోంది. అసలే అల్లువారి హీరోకి పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎక్కువ రోజులు వాళ్లకు దూరంగా ఉండాలంటే కష్టమే. అందువల్ల, పిల్లలతో కలసి స్నేహ రెండు రోజుల క్రితమే ఊటీ వెళ్లారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పిల్లలతో ఆడుతూ రిలాక్స్ అవుతున్నారట అర్జున్. ఆదివారం ఉదయం ఓ రెస్టారెంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత... అమ్మకు మురిపెంగా అర్హ ఓ ముద్దిస్తుంటే, కుమార్తెను ఎత్తుకున్న అర్జున్ ఎంతో ఆనందపడుతున్న సమయంలో ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు కెమెరా కళ్లకు పని చెప్పారు. నెట్టింట్లోని ఈ ఫొటోలు అభిమానుల్ని ఆకర్షిస్తున్నాయి. -
డ్యూయెట్ కోసమా.. విలన్లతో ఫైటా..!
హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను కుమ్మేసిన సూర్య కూల్‌గా ఊటీ చేరుకున్నాడు. చల్లదనానికి చిరునామా ఊటీ. మరి.. ఆ చల్లచల్లని ప్రాంతంలో హీరోయిన్‌తో డ్యూయెట్ పాడతారో లేక అక్కడ కూడా విలన్లను రఫ్ఫాడేస్తారో కానీ, సూర్య ఊటీలో ల్యాండ్ అయిపోయాడు. సూర్య ఎవరో ఊహించే ఉంటారు. యస్... అల్లు అర్జున్. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత తెలిపారు. -
లోయలో పడ్డ వ్యాన్
చెన్నై: ఊటీ-మేటిపాల్యం రహదారిలో వ్యాన్ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
తమ్ముడితో ఆడుకుంటూ.. బాలిక మృతి
సరదాగా ఊటీ చూద్దామని కుటుంబంతో సహా వచ్చి, అక్కడ తన తమ్ముడితో ఆడుకుంటూ ఓ పాప తన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇక్కడి బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగింది. కర్ణాటకలోని చామరాజనగర్ నుంచి మొత్తం 12 మంది సభ్యులు గల బృందం ఊటీకి వచ్చింది. అందులో 12 ఏళ్ల బాలికతో పాటు 5 ఏళ్ల వయసున్న ఆమె తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్లిద్దరూ అక్కడ ఒక ఉయ్యాలలో ఆడుకుంటూ ఉండగా ఇద్దరూ అనుకోకుండా ఢీకొన్నారు. దాంతో ఆమె తల ఉయ్యాల ఉన్న ఇనుప రాడ్‌కు తగిలింది. ఫలితంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలిక తమ్ముడికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయని, అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. -
సిజేరియన్ చేయించుకున్న 5గురు మహిళల మృతి
-
ఊటీలో హుషారుగా..!
కొంటె పాత్రలు, అల్లరి పాత్రలు చేయడంలో అల్లు అర్జున్ ప్రత్యేకతే వేరు. ఇక త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. గత నెలాఖరున ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైంది. అల్లు అర్జున్ శారీరక భాషకు తగ్గట్టుగా, తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన సమంత, అదా శర్మ, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురితోనూ బన్నీకి ఇది తొలి చిత్రం అయితే, ‘అత్తారింటికి దారేది’ తర్వాత సమంత, ప్రణీతలతో త్రివిక్రమ్ చేస్తున్న చిత్రమిది. ఇంకా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను స్నేహ చేయడం విశేషం. విభిన్న పాత్రలు పోషిస్తారని పేరు తెచ్చుకున్న ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. -
ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన ఫాదర్
చెన్నై: అమెరికాలో ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న చర్చి ఫాదర్ జోసెఫ్ పళనివేల్ జయపాల్‌ను ఆ దేశానికి అప్పగించాలంటూ ఢిల్లీ కోర్టు కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీకి చెందిన ఫాదర్ జోసెఫ్ 2004-05లో అమెరికాలోని మిన్నసోట్టా నగర్లో ఉండేవాడు. అక్కడి చర్చికి వచ్చిన 14, 16 ఏళ్ల చిన్నారులపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. అత్యాచారం సంఘటనతో తీవ్ర అనారోగ్యానికి గురైన 14 ఏళ్ల బాలికను అక్కడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతుకాన్ని బయటకు చెబితే చిన్నారిని హతమారుస్తానని ఫాదర్ బెదిరించినట్లు మరో ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలను ఖండించిన జోసెఫ్ 2005లో భారత్‌కు చేరుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అమెరికాలోని రెసివ్‌కవుండి కోర్టు ఫాదర్ జోసెఫ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా 2010 డిసెంబరు 28న వారెంట్ జారీచేసింది. ఫాదర్‌ను అప్పగించాలని భారత విదేశాంగశాఖను అమెరికా కోర్టు 2011 ఫిబ్రవరిలో కోరింది. దీంతో విదేశాంగ శాఖ నవీన్ కుమార్ అనే ప్రత్యేక న్యాయవాదిని ఫాదర్ కేసు విషయమై నియమించింది. ఢిల్లీలోని అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ఫాదర్‌పై నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవాలు ఉన్నట్లు కోర్టు అభిప్రాయపడుతున్నదని ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అజయ్‌కార్క్ వ్యాఖ్యానించారు. కాబట్టి అత్యాచార ఆరోపణలపై ఏ దేశం విచారణ కోరుతోందో ఆ దేశానికి (అమెరికా) ఫాదర్ జోసెఫ్‌ను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేజిస్ట్రేటు ఆదేశించారు. ఫాదర్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అక్కడి చట్టాల ప్రకారం 30 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ** -
ఊటీ చేస్తామన్న బాబు లూటీకి సిద్ధం
పెద బయలు: విశాఖ మన్యాన్ని మరో ఊటీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు మన్యాన్ని లూటీ చేసే పనిలో ఉన్నారని ఎంపీపీ సల్లంగి ఉమా మహేశ్వరరావు, జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని ఆరోపించారు. పెదబయలులో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాక్సయిట్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ కూడలిలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధికి దూరమైన మన్యంలో గిరిజన యువతకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది పోయి బాక్సయిట్ తవ్వకాలతో గిరిజనులను నిరాశ్రయుల్ని చేయాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. బాక్సయిట్ జోలికొస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సయిట్‌కు వ్యతిరేకమని చెప్పి, అధికారంలో వచ్చాక తవ్వకాలు ప్రారంభిస్తామనడం విచారకరమన్నారు. బాక్సయిట్ తవ్వకాలతో లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఎన్నోమార్లు శాస్త్రవేత్తలు చెప్పినా తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించారు. 1/70 చట్టానికి తూట్లు పొడిచే బాక్సయిట్ తవ్వకాలు చేపడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు పెదబయలు జెడ్పీ అతిథి గృహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ అంబేద్కర్‌కు వినతి ప్రతం అందించారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్, మన్యం లూటీ బాబును తరిమి కొట్టాలని, బాక్సయిట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు వంతాల శాంతి, మాజీ ఎంపీపీ బాలంనాయుడు, సూర్యనారాయణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాంగి సింహాచలం, వైఎస్సార్ సీపీ నేతలు సందడి కొండబాబు, పద్మాకరరావు, వంతాల అప్పారావు, ఎంపీటీసీలు కృష్ణారావు, మాధవరావు, బోడిరాజ్, సర్పంచ్‌లు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
ఊటీలో నరభక్షక పులి కాల్చివేత
పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ఊటీ జిల్లాలో గ్రామస్థులకు నరభక్షక పులి బాధ ఎట్టకేలకు తీరింది. ముగ్గురు వ్యక్తులతో పాటు.. రెండు ఆవులు, మరో రెండు మేకలను కూడా చంపి తిన్న ఆ పులిని అటవీ శాఖాధికారులు, పోలీసులు కలిసి కాల్చిచంపారు. తొలిసారి ఈ పులి ఈనెల 5వ తేదీన కనిపించింది. అప్పటినుంచి రెండు వారాల పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ నరకం చూపించింది. కుండచప్పాయ్ గ్రామ సమీపంలో అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు కాల్చిచంపారని, తుపాకి గుళ్లు తగిలిన తర్వాత కనిపించకుండా పోయిన పులి మృతదేహాన్ని దాదాపు గంట తర్వాత స్వాధీనం చేసుకున్నారని నీలగిరి జిల్లా కలెక్టర్ పి.శంకర్ తెలిపారు. అంతకు ముందు ఈ పులి ముగ్గురు వ్యక్తులను చంపి తినేసింది. ఈ పులి కారణంగా ఆ ప్రాంతంలోని పాఠశాలలన్నింటినీ మూసేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. సాయంత్రం కావడానికి ముందే జనమంతా ఇళ్లకు పరుగులు తీశారు. టీ ఎస్టేట్లు, పండ్లు, కూరగాయల తోటల్లో కూడా పనివేళలను తగ్గించారు. అటవీ శాఖాధికారులు ఎంతకూ దాన్ని వేటాడేందుకు ముందుకు రాకపోవడంతో బుధవారం నాడు దాదాపు 600 మంది గ్రామస్థులు కత్తులు, కొడవళ్లు పట్టుకుని అడవిలోకి బయల్దేరారు. అయితే, వాళ్లుంటే వేటకు ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పారు. శిక్షణ పొందిన ఏనుగులను తీసుకుని పులివేటకు బయల్దేరారు. కెమెరా ట్రాప్‌లు పులి ఆనవాళ్లను గుర్తించగలిగామని డీఎఫ్ఓ తెలిపారు. తిండిలేక అది నీరసంగా కనిపించిందని, గాయాలు కూడా కావడంతో రక్తపు మరకలు కూడా కనిపించాయని అధికారులు చెప్పారు.