
అల్లు అర్జున్ ఆదివారమంతా అమ్మాయి అర్హ, అబ్బాయి అయాన్, అర్ధాంగి స్నేహలతో ఆడుతూ పాడుతూ గడిపారట. అదీ హైదరాబాద్‌లో కాదు, ఊటీలో! అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ షూటింగ్ ఊటీలో జరుగుతోంది. అసలే అల్లువారి హీరోకి పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎక్కువ రోజులు వాళ్లకు దూరంగా ఉండాలంటే కష్టమే.
అందువల్ల, పిల్లలతో కలసి స్నేహ రెండు రోజుల క్రితమే ఊటీ వెళ్లారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పిల్లలతో ఆడుతూ రిలాక్స్ అవుతున్నారట అర్జున్. ఆదివారం ఉదయం ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత... అమ్మకు మురిపెంగా అర్హ ఓ ముద్దిస్తుంటే, కుమార్తెను ఎత్తుకున్న అర్జున్ ఎంతో ఆనందపడుతున్న సమయంలో ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు కెమెరా కళ్లకు పని చెప్పారు. నెట్టింట్లోని ఈ ఫొటోలు అభిమానుల్ని ఆకర్షిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment