సూర్య మంచి మనసు.. అభిమాని కుటుంబానికి భరోసా | Suriya Visits His Fan Family Who Died In A Road Accident | Sakshi
Sakshi News home page

Suriya: సూర్య మంచి మనసు.. అభిమాని కుటుంబానికి భరోసా

Published Mon, May 30 2022 10:42 AM | Last Updated on Mon, May 30 2022 10:43 AM

Suriya Visits His Fan Family Who Died In A Road Accident - Sakshi

చెన్నై సినిమా: కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదంలో మరణించిన తన అభిమాని కుటుంబాన్ని సూర్య పరామర్శించి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా సూర్య అభిమాన సంఘం కార్యదర్శి జగదీశన్‌ ఇటీవల మోటార్‌ సైకిల్‌పై వెళుతుండగా నామక్కల్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో లారీ ఢీకొని మృతి చెందాడు. దీంతో నటుడు సూర్య శనివారం (మే 28) రాత్రి నామక్కల్‌లోని ఆ అభిమాని ఇంటికి వెళ్లి అతని భార్య, పిల్లల్ని పరామర్శించారు. 

ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చి, వారి రెండున్నరేళ్ల కూతురు విద్యకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. సూర్య వచ్చిన విషయం తెలిసి ఆ ప్రాంతం ప్రజలు ఆయన్ని చూడటానికి గుమిగూడారు. సూర్య ఉదారతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి:👇
సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్‌ బాబు.. వీడియో వైరల్‌
ఆంటీ అవసరమా.. కూతురు పెళ్లయ్యేదాకా ఇవి తగ్గించుకో.. సురేఖ వాణిపై ట్రోలింగ్



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement